Home » Electric scooter : రూ.54999, రూ.62999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!

Electric scooter : రూ.54999, రూ.62999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!

e-sprinto electric scooters
Spread the love

e-sprinto electric scooters : భారత ఆటోమొబైల్‌ మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేశాయి. పెట్రోల్ వాహనాలను ప్రత్యామ్నాయంగా వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలపై మొగ్గుచూపుతుండడంతో ఈవీలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థలు సరికొత్త వాహనాలను ప్రవేశపెడుతున్నాయి.

తాజా ఇ-స్ప్రింటో (e-sprinto) కంపెనీ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న Rapo, Roamy పేర్లతో కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేసింది.
ఇందులో మొత్తం 6 మోడళ్లను కలిగి ఉంది.

e-sprinto Roamy రోమీ ఇ-స్కూటర్‌ ప్రారంభ ధర రూ.54,999 (ఎక్స్‌షోరూం), Rapo రాపో ప్రారంభ ధర రూ.62,999 (ఎక్స్‌షోరూం)గా ఉంది. కాలేజీ విద్యార్థులు, పట్టణ ప్రజలు, కార్మికులు, మహిళలు సహా అన్ని వర్గాలకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ స్కూటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు ఇ-స్ప్రింటో సంస్థ పేర్కొంది.

ఇ-స్ర్పింటో రాపో స్పెసిఫికేషన్లు

e-sprinto Rapo స్కూటర్‌ పొడవు 1840 mm, 720 mm వెడల్పు, 1150 mm ఎత్తు ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 170
mm ఉంది. పోర్టబుల్‌ ఆటోకటాఫ్‌ ఛార్జర్‌తో కూడిన లిథియం/ లీడ్‌ బ్యాటరీ, IP65 వాటర్‌ఫ్రూఫ్‌ రేటింగ్‌తో 250 W BLDC హబ్‌ మోటార్‌కు
శక్తిని ఇస్తుంది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Rapo ఇ-స్కూటర్‌ గరిష్ఠంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 100 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్
ముందు భాగంలో టెలిస్కోపిక్‌ హైడ్రాలిక్‌ సస్పెన్షన్‌, వెనుక భాగంలో కాయిల్‌ స్ప్రింగ్‌ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. 12 అంగుళాల ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌, 10
అంగుళాలతో వెనుక వైపు డ్రమ్‌ బ్రేక్‌లు ఉంటాయి. 150 కిలోల లోడింగ్‌ సామర్థ్యం వస్తుందని ఇ-స్ర్పింటో సంస్థ తెలిపింది.

రోమీ స్పెసిఫికేషన్లు

e-sprinto Roamy స్కూటర్‌ పొడవు 1800 mm, 710 mm, ఎత్తు 1120mm, గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. పోర్టబుల్‌ ఆటో కట్ ఆర్‌ ఛార్జర్‌తో లిథియం/లీడ్‌ బ్యాటరీని కలిగి ఉంది. 250 W BLDC  హబ్‌ మోటార్‌, IP65 రేటింగ్‌తో వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది..

Roamy Electric Scooter గరిష్ఠంగా 25 kmph వేగంతో ప్రయాణిస్తుంది. ఇక రేంజ్ విషయానికొస్తే ఇది సింగిల్‌
ఛార్జింగ్‌లో 100 కి.మీ మైలేజీ ఇస్తుంది.. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అధునాతన టెలిస్కోపిక్‌ హైడ్రాలిక్‌ ఫ్రంట్ సస్పెన్షన్‌, ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌ తో కూడిన
కాయిల్‌ స్ర్పింగ్ సహా 3 స్టెప్‌ అడ్జెస్టబుల్‌ సస్పెన్షన్ ఉన్నాయి. 150 కిలోల లోడింగ్ సామర్థ్యంతో వస్తుంది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

ఫీచర్‌లు ఏమున్నాయి..?

ఈ రెండు స్కూటర్లలో రిమోట్ లాక్/ అన్‌లాక్‌, రిమోట్‌ స్టార్ట్‌.. ఇంజిన్ కిల్ స్విచ్‌/ చైల్డ్‌ లాక్ ‌/ పార్కింగ్‌ మోడ్‌ తోపాటు USB మొబైల్‌
ఛార్జింగ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. డిజిటల్‌ డిస్‌ప్లేలో బ్యాటరీ స్థితి, మోటార్‌ వైఫల్యం తోపాటు కంట్రోల్‌ వైఫల్యం, థొరెటల్‌ వైఫల్యం
వంటి వివరాలను తెలుపుతుంది.

రాపో ఇ- స్కూటర్‌ బ్లూ, రెడ్‌, గ్రే, బ్లాక్ అండ్‌ వైట్‌ రంగులలో లభిస్తుంది. రోమీ ఇ-స్కూటర్‌ బ్లూ, రెడ్‌, నలుపు, వైట్‌, బూడిద రంగులలో అందుబాటులో ఉంటుంది. అత్యంత చౌక ధరలకే e-sprinto electric scooters  వస్తుండడంతో కస్టమర్ల నుంచి భారీ స్పందన వస్తుందని సంస్థ అంచనాలు పెట్టుకుంది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

ఇ-స్ర్పింటో స్కూటర్‌ సహా వ్యవస్థాపకుడు డైరెక్టర్‌ అతుల్‌ గుప్తా మాట్లాడుతూ.. స్కూటర్ల విడుదలపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ రెండు ఈవీలు భద్రతను ఇస్తాయని హామీ ఇచ్చారు. తాము వినూత్న ఉత్పత్తులను పరిచయం చేసేందుకు, మరింత వైవిధ్యపరిచేందుకు చురుగ్గా అన్వేషిస్తున్నామని చెప్పారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు… కృతజ్ఞతలు..

Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

2 thoughts on “Electric scooter : రూ.54999, రూ.62999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *