Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Mahindra : మహీంద్రా XUV.e8 ఎలక్ట్రిక్ కారు టెస్టింగ్ ఫొటోలు లీక్.. ఫీచర్లు ధరలు ఎలా ఉంటాయి..?

Spread the love

కొత్త మహీద్రా ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ 2024 చివరలో వచ్చే అవకాశం

భారత్ లో త్వరలో రానున్న ఆల్- ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌యూవీ700, Mahindra XUV.e8 లను ఇండియన్ ఆటో కార్ దిగ్గజం మహీంద్రా యాక్టివ్ గా
టెస్టింగ్ చేస్తూనే ఉంది. ఈ వెహికిల్స్ ఎన్నోసార్లు టెస్ట్ మ్యూల్ షీట్ తో కవర్ చేసి టెస్టింగ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ సమయాల్లో ఈ వాహనం
ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ కు సంబందించిన ఎన్నో కీలకమైన వివరాలు వెల్లడయ్యాయి. మొత్తానికి, ఇటీవల తాజాగా కనిపించిన స్పై ఫోటోలలో,
మోడల్ కీలక వివరాలు వెల్లడయ్యాయి.

Mahindra XUV.e8 Front Bumper

పైన కనిపిస్తున్న ఫోటో ప్రకారం, ఈ మోడల్ ఫ్రంట్ ప్రొఫైల్ పూర్తిగా డే టైం రన్నింగ్ ఎల్ఈడీ లైట్ బార్ తో వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే, ఈ
మోడల్ లుక్ టాటా హారియర్, సఫారీ ఫేస్ లిఫ్ట్స్ మాదిరిగానే ఉండనుంది. అప్పుడు, టెస్ట్ మ్యూల్ పాడ్ వంటి డిజైన్‌తో వర్టికల్ గా అమర్చబడిన స్ప్లిట్
ఎల్ఈడీహెడ్‌ల్యాంప్ సెటప్‌ను పొందవచ్చు.

Mahindra XUV.e8 Rear View

ఈ మోడల్ వెనుక భాగాన్ని పరిశీలిస్తే టెస్ట్ మ్యూల్ లుక్స్ పూర్తిగా ఎక్స్‌యూవీ700లో ఉన్నట్లు యారో-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రియర్
వైపర్, షార్క్-ఫిన్ యాంటెన్నా, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. అలాగే దీని వెనుక రియర్ బంపర్ కూడా ఐసీఈ వెర్షన్ మాదిరిగా
ఉండనుంది.

Mahindra XUV.e8 Center Console/Centre Console Storage

మహీంద్రా XUV.e8 ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇంతకుముందు స్పై షాట్స్ ఇందులో 3-స్క్రీన్ సెటప్ ను జత చేసినట్లు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఇందులో ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, కో-డ్రైవర్‌కు ఎడమ వైపు ఉన్నాయి. అంతేకాకుండా, ఇది XUV400 మాదిరిగా డ్రైవ్ సెలెక్టర్ లీవర్‌తో ఒకే రకమైన సెంటర్ కన్సోల్ లేఅవుట్‌ను పొందవచ్చు.

ఈ వాహనం స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, కొలతలపరంగా XUV.e8 వెహికిల్ 2,762 వీల్ బేస్ తో 4,740mm పొడవు ఉంది.. ఇది ఆల్-వీల్
డ్రైవ్ కాన్ఫిగరేషన్ తో 80kWh బ్యాటరీ ప్యాక్ తో వచ్చే అవకాశం ఉంది. ఇది 80kWh బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. ఇది సింగిల్ చార్జిపై 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వనున్నట్లు సమాచారం.

Mahindra XUV.e8 మార్కెట్లోకి ఎప్పుడు రానుంది

వచ్చే సంవత్సరం మహీంద్రా XUV.e8ని లాంచ్ చేయడానికి మహీంద్రా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి
వచ్చాక త్వరలో రాబోయే హారియర్ ఈవీతో పోటీ పడనుంది.


Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *