Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Hero MotoCorp | వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో జట్టుకట్టిన హీరో మోటోకార్ప్

Spread the love

Hero MotoCorp : ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. భారతదేశంలో ఇంటర్‌ఆపరబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ సహకారం ద్వారా EV వినియోగదారులు దేశవ్యాప్తంగా Hero MotoCorp VIDA, Ather గ్రిడ్‌లను సజావుగా ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ఈ రెండు సంస్థలకు సంబంధించిన నెట్‌వర్క్ 1900కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లతో 100 నగరాలను కవర్ చేస్తుంది.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇటీవల లైట్ ఎలక్ట్రిక్ కంబైన్డ్ ఛార్జింగ్ సిస్టమ్ (LECCS) ని ఆమోదించింది. ఇది తేలికపాటి ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారతదేశంలో మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేయబడిన AC మరియు DC కంబైన్డ్ ఛార్జింగ్ కనెక్టర్ ప్రమాణం.. బీఐఎస్ ఆమోదించబడిన ఛార్జింగ్ సిస్టమ్‌ను ఉపయోగించుకునే ఈ కంబైన్డ్ నెట్‌వర్క్ దేశంలోనే అతిపెద్ద EV ఛార్జింగ్ ఎకోసిస్టమ్ అవుతుంది.

ఇంటర్‌ఆపరబుల్ నెట్‌వర్క్ మొత్తం సెగ్మెంట్‌ను బలోపేతం చేయడం ద్వారా వినియోదారులకు చార్జింగ్ సమస్యలు దూరమవుతాయి. ఫలితంగా EV స్వీకరణను వేగవంతం అవుతుంది. “My VIDA” మరియు Ather యాప్ ద్వారా కస్టమర్‌లు తమకు సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌లను గుర్తించడంతోపాటు వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు.

హీరో మోటోకార్ప్‌లోని ఎమర్జింగ్ మొబిలిటీ BU చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డాక్టర్ స్వదేశ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. “దేశంలో ఈ అతిపెద్ద ఛార్జింగ్ నెట్‌వర్క్.. వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ నెట్ వర్క్ ద్వారా ప్రస్తుత, భవిష్యత్ కస్టమర్‌లు ఎటువంటి అవాంతరాలు లేకుండా తమ వాహనాలను ఉపయోగించగలుగుతారు అలాగే ఛార్జ్ చేయగలరు.’ అని తెలిపారు.

ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, CTO స్వప్నిల్ జైన్ మాట్లాడుతూ “ భారత OEMలు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచడంలో సహకరించడం గొప్ప విజయం. ఈ భాగస్వామ్యం వినియోగదారులకు దేశవ్యాప్తంగా విస్తృతమైన ఛార్జింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. అని పేర్కొన్నారు.


Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్,  ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *