Hero MotoCorp | వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో జట్టుకట్టిన హీరో మోటోకార్ప్
Hero MotoCorp : ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. భారతదేశంలో ఇంటర్‌ఆపరబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారం ద్వారా EV వినియోగదారులు దేశవ్యాప్తంగా Hero MotoCorp VIDA, Ather గ్రిడ్‌లను సజావుగా ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ఈ రెండు సంస్థలకు సంబంధించిన నెట్‌వర్క్ 1900కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లతో 100 నగరాలను కవర్ చేస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్…