Harithamithra Telugu News

Home EV Updates charging Stations Hero MotoCorp | వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో...

Hero MotoCorp | వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో జట్టుకట్టిన హీరో మోటోకార్ప్

0
Hero MotoCorp charging stations

Hero MotoCorp : ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. భారతదేశంలో ఇంటర్‌ఆపరబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ సహకారం ద్వారా EV వినియోగదారులు దేశవ్యాప్తంగా Hero MotoCorp VIDA, Ather గ్రిడ్‌లను సజావుగా ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ఈ రెండు సంస్థలకు సంబంధించిన నెట్‌వర్క్ 1900కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లతో 100 నగరాలను కవర్ చేస్తుంది.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇటీవల లైట్ ఎలక్ట్రిక్ కంబైన్డ్ ఛార్జింగ్ సిస్టమ్ (LECCS) ని ఆమోదించింది. ఇది తేలికపాటి ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారతదేశంలో మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేయబడిన AC మరియు DC కంబైన్డ్ ఛార్జింగ్ కనెక్టర్ ప్రమాణం.. బీఐఎస్ ఆమోదించబడిన ఛార్జింగ్ సిస్టమ్‌ను ఉపయోగించుకునే ఈ కంబైన్డ్ నెట్‌వర్క్ దేశంలోనే అతిపెద్ద EV ఛార్జింగ్ ఎకోసిస్టమ్ అవుతుంది.

ఇంటర్‌ఆపరబుల్ నెట్‌వర్క్ మొత్తం సెగ్మెంట్‌ను బలోపేతం చేయడం ద్వారా వినియోదారులకు చార్జింగ్ సమస్యలు దూరమవుతాయి. ఫలితంగా EV స్వీకరణను వేగవంతం అవుతుంది. “My VIDA” మరియు Ather యాప్ ద్వారా కస్టమర్‌లు తమకు సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌లను గుర్తించడంతోపాటు వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు.

హీరో మోటోకార్ప్‌లోని ఎమర్జింగ్ మొబిలిటీ BU చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డాక్టర్ స్వదేశ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. “దేశంలో ఈ అతిపెద్ద ఛార్జింగ్ నెట్‌వర్క్.. వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ నెట్ వర్క్ ద్వారా ప్రస్తుత, భవిష్యత్ కస్టమర్‌లు ఎటువంటి అవాంతరాలు లేకుండా తమ వాహనాలను ఉపయోగించగలుగుతారు అలాగే ఛార్జ్ చేయగలరు.’ అని తెలిపారు.

ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, CTO స్వప్నిల్ జైన్ మాట్లాడుతూ “ భారత OEMలు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచడంలో సహకరించడం గొప్ప విజయం. ఈ భాగస్వామ్యం వినియోగదారులకు దేశవ్యాప్తంగా విస్తృతమైన ఛార్జింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. అని పేర్కొన్నారు.


Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్,  ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.

Previous articleBajaj Auto| బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్లపై యమ క్రేజ్.. నవంబర్ లో భారీగా పెరిగిన అమ్మకాలు
Next articleKia | దేశవ్యాప్తంగా 1000+ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన కియా.. K-Charge తో ఈజీగా..
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here