EV Exchange Program| హైదరాబాద్ కి చెందిన EV స్టార్టప్ ప్యూర్ ఈవీ ఆటోమోటివ్ పరిశ్రమలో సరికొత్త సంచలనానికి తెర తీసింది. మొదటి సారి ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా ప్రారంభించింది.
వెహికల్ ఎక్స్ఛేంజ్ క్యాంపులు సాంప్రదాయ పెట్రోల్ (ICE) 2-వీలర్లకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ, తొలిసారి పాత ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఎక్స్చేంజ్ చేసుకునే విధానాన్ని ప్యూర్ ఈవీ ప్రవేశపెట్టింది. దీనికి వినియోగదారుల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ ఆఫర్.. కొత్త బుకింగ్‌ల ప్రవాహానికి దారితీసింది.
పాన్ ఇండియా అంతటా 10 కోట్లకు పైగా ICE 2-వీలర్లు ఉన్న మార్కెట్లో.. ఆకర్షణీయమైన ప్రతిపాదనను అందించడం ద్వారా పెద్ద ఎత్తున తన మార్కెట్ ను పెంచుకోవాలని PURE EV లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్స్ఛేంజ్ క్యాంప్ (EV Exchange Program) లో, వినియోగదారులు వారు ఉపయోగించిన పాత ఎలక్ట్రిక్/పెట్రోల్ 2-వీలర్లను తీసుకువస్తారు. స్థానిక నిపుణులు ఆన్-ది-స్పాట్ విలువ కడతారు. ఆ మొత్తాన్ని బ్రాండ్-న్యూ ప్యూర్ EV వాహనం ధర లో నుంచి తీసేస్తారు. EMI డౌన్ పేమెంట్‌ను ప్రభావవంతంగా తగ్గిస్తుంది. ముందస్తు ఖర్చు లేకుండా తక్కువ EMIల ద్వారా బ్యాలెన్స్ లోన్ చెల్లింపులను సర్దుబాటు చేయడానికి వినియోగదారులకు వీలు కలుగుతుంది.
కంపెనీ ప్రవేశపెట్టిన ఎక్స్చేంజి విధానం వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా సానుకూల వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ప్రాంతంలో గణనీయ సంఖ్యలో 2-వీలర్ వినియోగదారులను ఆకర్షించడం ద్వారా, PURE EV ఎక్స్ఛేంజ్ వాక్-ఇన్లు బుకింగ్‌లను పెంచుకోవాలని భావిస్తుంది.
ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌తో ఇతర EV బ్రాండ్ల వినియోగదారులను తమ వైపునకు వచ్చే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. వివిధ బ్రాండ్ల నుండి ICE ద్విచక్ర వాహనాల యజమానులు EV వాహనాలకు మారే అవకాశాన్ని ఉత్సాహంగా స్వీకరిస్తారు.
కాగా ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా వినియోగదారులు పాల్గొన్నారు వారి పాత వాహనాలను కొత్త PURE వాహనాలతో మార్చుకున్నారు. వినియోగదారులకు వారి వాహనాల పరిస్థితి ఆధారంగా గరిష్ట విలువ రూ. 38,000 వరకు అందించారు. PURE EV రాబోయే పొంగల్, పడ్వా పండుగల సందర్భంగా ఈ ఎక్స్చేంజి ప్రోగ్రాం ను కొనసాగిస్తామని ప్రకటించింది, సాంప్రదాయ పెట్రోల్ (ICE) 2-వీలర్ యజమానులు మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రిక్ వినియోగదారులు కూడా ఈ ప్రోగ్రాం పై ఆసక్తి కలిగి ఉన్నారు.
PURE EV సీఈఓ రోహిత్ వదేరా మాట్లాడుతూ.. “పండుగ సీజన్లో మా EV వాహన మార్పిడి కార్యక్రమానికి అఖండమైన స్పందన వచ్చింది.. రాబోయే పొంగల్, పడ్వా పండుగల సందర్భంగా ఈ అవకాశాన్ని మరింత మంది వినియోగదారులకు విస్తరించేందుకు యత్నిస్తాం.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం యూజ్డ్ వెహికల్ మార్కెట్‌ను సృష్టించిన భారతదేశంలో మొట్టమొదటి EV 2-వీలర్ బ్రాండ్ PURE EV అని ప్రకటించడానికి మేము గర్విస్తున్నాము. ఇది కీలకమైన భాగాలను పునరుద్ధరించడం, రీసైక్లింగ్ చేయడంలో కంపెనీ సామర్థ్యాలను రుజువు చేస్తుంది. ”అని అన్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.