FAME EV Subsidy Scheme

FAME EV Subsidy | ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఎత్తివేస్తారా.. ఇదే జరిగితే.. ఈవీలు కొనాలనుకునేవారికి పెద్ద షాకే..

Spread the love

FAME EV Subsidy | ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ( FAME ) రెండో దశ ను కొనసాగించేట్టు కనిపించడం లేదు.. కేంద్రం ఈవీలపై సబ్సిడీని తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరో మాటలో చెప్పాలంటే, FAME III పథకం అమలు చేయబడదు. ఇంతకుముందు, ఈ పథకం కొనసాగింపు గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఆందోళనలను వ్యక్తం చేసింది, ఇప్పుడు, ఇతర ప్రభుత్వ శాఖలు కూడా నార్త్ బ్లాక్ అభిప్రాయాలను అంగీకరించాయి. ఫేమ్ 2 కింద ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలను తగ్గించింది, దీని ఫలితంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అయితే, అమ్మకాలు ఇప్పుడు స్థిరంగా కనిపిస్తున్నాయి. ఇది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం ఇప్పుడు సహజంగా. స్వచ్ఛందంగానే జరుగుతోందని ప్రభుత్వ అధికారులు వాదిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ వాహనాలతో నెలవారీ ఖర్చు తడిసి మోపెడవుతుండడంతో చాలా మంది ఈవీల వైపు మొగ్గుచూపుతున్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. FAME II (FAME EV Subsidy) సబ్సిడీ ముగింపు రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాలకు వర్తించే FAME II సబ్సిడీ ఏప్రిల్ 1, 2019న మొత్తం రూ. 10,000 కోట్ల బడ్జెట్ తో ప్రారంభమైంది, ఇది ఐదేళ్లపాటు కొనసాగుతూ.. మార్చి 31, 2024తో ముగుస్తుంది.
అయితే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (Heavy Industry Ministry) ఈ పథకాన్ని పొడిగించాలని కోరుతోంది. కానీ దీనికి ఇతర మంత్రిత్వ శాఖల నుండి మద్దతు లభించలేదని ToI నివేదిక తెలిపింది. టెస్లా వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల తయారీదారులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారతదేశంలో తమ తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో FAME సబ్సిడీని రద్దు చేయాలనే నిర్ణయం తెరపైకి వచ్చింది.
దేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరిగాయి. అయితే, ఉత్తర, తూర్పు ప్రాంతాలలో వాహనాలకు డిమాండ్ తక్కువగా ఉంది. అయితే పెట్రోల్ ధరలు తగ్గకుండా స్థిరంగా ఉండడంతో అందరూ ఈవీల కొనుగోళ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్,  ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.

More From Author

Hero MotoCorp Hero vida v1 offers

Hero vida v1 offers : 2023 ఇయర్ ఎండ్ సేల్.. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు.. 

EV Exchange Program

EV Exchange Program : మీ పాత ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈజీగా మార్చుకోండి..ఈవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ని ప్రకటించిన Pure EV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest

Indie Electric Scooter : భార‌తీయ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు అంతర్జాతీయ గౌరవం

రివర్ మొబిలిటీ ‘ఇండీ’ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెడ్ డాట్ డిజైన్ అవార్డు 2025 Indie Electric Scooter : రివర్ మొబిలిటీ తన ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రెడ్ డాట్ ప్రొడక్ట్ డిజైన్ అవార్డు 2025ను అందుకుంది, 2024లో రెడ్ డాట్ డిజైన్ కాన్సెప్ట్ అవార్డుకు సైతం రివర్​ మొబిలిటీ కైవసం చేసుకుంది. ఈ...