Ola Electric S1X 4kWh : ఎలక్ట్రిక్ స్కూటర్ల ద్వారా గ్రీన్ మొబిలిటీని మరింతగా పెంచడానికి ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు పవర్ ఫుల్ 6kW మోటార్, 190 కి.మీ.ల లాంగ్ రేంజ్ తో ఓలా S1X 4kWh వేరియంట్ ను విడుదల చేసింది. ఈ కొత్త S1X 4kWh ఎక్స్ షోరూం ధర రూ. 1,09,999 గా ఉంది. దీని డెలివరీలు ఏప్రిల్ 2024 నుండి ప్రారంభమవుతాయి. మరో నమ్మశక్యం కాని శుభవార్త ఏంటంటే.. కంపెనీ తన అన్ని స్కూటర్లకు 8 సంవత్సరాలు లేదా 80,000 కిమీల వరకు ఎక్స్ టెండెడ్ బ్యాటరీ వారంటీని కూడా ప్రకటించింది. దీంతో బ్యాటరీ హెల్త్ గురించి కస్టమర్ ఆందోళన చెందాల్సిన అవసరం తప్పింది. EV స్వీకరణకు అతిపెద్ద అడ్డంకిని తొలగించినట్లైంది.
కొత్త ఆఫర్ పై ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ & MD భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. “ తమ ఉత్పత్తులు, సేవలు, ఛార్జింగ్ నెట్‌వర్క్ , బ్యాటరీ వారంటీ వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా EV స్వీకరణకు ఉన్న అన్ని అడ్డంకులను అధిగమించేలా చేస్తున్నాయి. అత్యంత తక్కువ ధరలో 190 కిమీల రేంజ్ కలిగిన సరికొత్త S1 X 4kWh వేరియంట్ స్కూటర్ అందిస్తున్నాం. భారతదేశం అంతటా మా సర్వీస్ లు, ఛార్జింగ్ నెట్‌వర్క్‌ని విస్తరించడంతో పాటు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా మా 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ ఇవ్వడం EV పరిశ్రమలో కొత్త అధ్యయనానికి నాంది పలికాం. ఈ కార్యక్రమాలతో, మేము 2W EV స్వీకరణకు సాధ్యమయ్యే అన్ని అడ్డంకులను పరిష్కరించాం. ఇవి దేశవ్యాప్తంగా వాహనదారులు EVలకు మారడాన్ని మరింత వేగవంతం చేస్తాయని మేము విశ్వసిస్తున్నాము. అని తెలిపారు.
90కి.మీ టాప్ స్పీడ్.. 190కిమీ రేంజ్
S1 X 4kWhతో #EndICEAage: నమ్మశక్యం కాని రేంజ్, తక్కువ ధరతో కొత్త S1X 4kWh వేరియంట్ ను తీసుకొచ్చింది ఓలా ఎలక్ట్రిక్. ఇది 3.3సెకన్లలోనే 0-40 Km/h వేగాన్ని అందుకోగలదు. గంటలకు 90 Km/h గరిష్ట వేగంతో దూసుకెళుతుంది. అలాగే ఒక్కసారి చార్జి చేస్తే ఏకంగా 190 kms IDC రేంజ్ ను అందిస్తుంది. స్కూటర్ శక్తివంతమైన 6kW మోటార్‌తో వస్తుంది. ఫాస్టెస్ట్ ఫర్ ఫార్మెన్స్, అత్యుత్తమ రైడ్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. S1X 4 kWh ICE మోడల్‌లతో సమానమైన ధరను కలిగి ఉంది.
S1X రెడ్ వెలాసిటీ, మిడ్‌నైట్, వోగ్, స్టెల్లార్, ఫంక్, పోర్సిలైన్ వైట్, లిక్విడ్ సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంది. అత్యంత అధునాతనమైన, అధునాతనమైన Gen-2 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన S1 X శ్రేణి వివిధ రోజువారీ ప్రయాణ అవసరాలకు రూపొందించింది. కాగా ఓలా S1X శ్రేణిలో ఇప్పుడు 4kWh, 3kWh, 2kWh ఈరోజు ధరలు వరుసగా INR 109,999*, INR 89,999*, INR 79,999* ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని డెలివరీలు ఏప్రిల్ 2024 నాటికి ప్రారంభమవుతాయి.
Specification | Ola S1X [4 kWh Variant] |
---|---|
Top Speed | 90 km/h |
Range | 190 km |
Acceleration | 3.3 sec |
Motor | 6 kW |
Battery Capacity | 4 kWh |
Modes | Eco, Normal, Sports |
Screen Size | 4.3″ |
8 సంవత్సరాల వారంటీ
ఈవీ పరిశ్రమలో బ్యాటరీపై మొదటి 8 సంవత్సరాల/80,000 కిమీల వరకు వారంటీని అందించడం కేవలం ఓలా కే సాధ్యమైంది. అదనపు ఖర్చు లేకుండా ఈ వారంటీని అందిస్తోంది. దీనితో, వాహనాల జీవితకాలాన్ని 2X ICE వాహనాలకు పొడిగించడం ద్వారా EV స్వీకరణకు అతిపెద్ద అడ్డంకిని కంపెనీ పరిష్కరించింది.
సర్వీస్ నెట్‌వర్క్ విస్తరణ
ఓలా ఎలక్ట్రిక్ ఏప్రిల్ 2024 నాటికి దేశవ్యాప్తంగా ప్రస్తుత 414 సర్వీస్ సెంటర్‌ల నుండి ~600 సెంటర్‌లకు తన సర్వీస్ నెట్‌వర్క్‌ను 50% విస్తరించే ప్రణాళికలను కూడా ఆవిష్కరించింది.
ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్
కంపెనీ తదుపరి త్రైమాసికం నాటికి దాని ఫాస్ట్-ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వేగంగా 10,000 పాయింట్లకు పెంచే ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ 3KW పోర్టబుల్ ఫాస్ట్ ఛార్జర్ కూడా పరిచయం చేసింది. ఇది రూ. 29,999 లకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
రూ.89,999 ల నుంచి ప్రారంభం
ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన స్కూటర్ పోర్ట్‌ఫోలియోను ఐదు హై క్లాస్ ఉత్పత్తులకు విస్తరించింది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్కూటర్ S1 Pro ( సెకండ్ జనరేషన్ ) రూ. 1,47,499 ధరలో అందుబాటులో ఉంది. Ola S1 Air Electric scooter రూ.1,19,999 వద్ద అమ్మకానికి ఉంది. అదనంగా దాని ICE-కిల్లర్ ఉత్పత్తి, S1Xని కొత్తగా మూడు వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది అవి S1 X+, S1 X (3kWh), మరియు S1 X (2kWh) విభిన్న ప్రాధాన్యతలతో రైడర్‌ల అవసరాలను తీరుస్తాయి. S1 X+ ప్రస్తుతం రూ. 89,999 లకే కొనుగోలు చేయవచ్చు. దీని ఎక్స్ షోరూం ధర INR రూ.1,09,999 కాగా ఫ్లాట్ INR 20,000 డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. అలాగే మరో రెండు వేరియంట్లు S1 X (3kWh) మరియు S1 X (2kWh) కోసం రిజర్వేషన్ విండో తెరిచారు. దీన్ని కేవలం రూ. 999 లకే బుక్ చేసుకోవచ్చు. ఇవి వరుసగా రూ. 99,999 మరియు రూ. 89,999 ప్రారంభ ధర లో అందుబాటులో ఉన్నాయి.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..