Monday, January 20Lend a hand to save the Planet
Shadow

BPCL : ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో 1800 ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు

Spread the love

ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా ఉన్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించన పెట్రోల్ బంకుల్లో సుమారు 1800 డీసీ ఫాస్ట్ చార్జర్ల ఏర్పాటుకు కీలక ఒప్పందం కుదిరింది. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్ తయారీదారు అయిన సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ (Servotech Power Systems ) భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) నుండి 1800 DC ఫాస్ట్ EV ఛార్జర్‌ల ఏర్పాటు కోసం ఆర్డర్‌ను పొందింది.

రూ. 120 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ కింద 60 kW,  120 kW రెండు ఛార్జర్లను ఏర్పాటు చేయనున్నారు. భారతదేశమంతటా ఈ 1,800 EV ఛార్జర్‌ల (EV chargers) ను ముఖ్యంగా ప్రధాన నగరాల్లోని BPCL పెట్రోల్ పంపుల వద్ద సర్వోటెక్ సంస్థ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది.  ఇది BPCL E-డ్రైవ్ ప్రాజెక్ట్‌లో భాగం, ఇది EV ఛార్జింగ్ మౌళిక సదుపాయాలను విస్తరించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. 2024 చివరి నాటికి ఈ 1,800 ఛార్జర్‌ల ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేయాలని సర్వోటెక్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇ-మొబిలిటీ టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేయడం, లావాదేవీలను ఆప్టిమైజ్ చేయడం, చార్జింగ్ పాయింట్ల లభ్యతను మెరుగుపరచడం, ఆవిష్కరణను సులభతరం చేయడంతోపాటు EV వినియోగదారుల కోసం నావిగేషన్‌ను సులభతరం చేయడం ఈ  ఒప్పదం లక్ష్యం.

READ MORE  2025 టాటా టియాగో , ఎంజీ కామెట్ ఈవీ మ‌ధ్య తేడాలు ఏంటి… ఏది బెస్ట్‌?

Servotech Power Systems డైరెక్టర్ సారిక భాటియా మాట్లాడుతూ.. “BPCL సహకారంతో భారతదేశంలోని  ఇ-మొబిలిటీ విప్లవాన్ని వేగవంతం చేయడంలో మేము చాలా గర్వపడుతున్నాము. మా భాగస్వామ్యం దేశవ్యాప్తంగా EV యజమానులకు EV ఛార్జింగ్‌ను అందుబాటులోకి తెచ్చే డైనమిక్ EV ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తుంది.

Also Read : ఇండియన్ రోడ్లపై ప్రత్యక్షమైన బ్యాట్ మాన్ తరహా కారు.. వైరల్ అవుతున్న వీడియోలు..

“సర్వోటెక్ ఇప్పటికే భారతదేశం అంతటా (జనవరి 2024 నాటికి) 4000 EV ఛార్జర్‌లను విజయవంతంగా సరఫరా చేసింది. ఈ వ్యూహాత్మక ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచించడమే కాకుండా బలమైన, విస్తారమైన ఛార్జింగ్ నెట్‌వర్క్‌కు వీలు కల్పిస్తుంది. ఇది అధిక వేగవంతమైన EV ఛార్జింగ్ అనేది భవిష్యత్తుకు అవసరమైనదని సరికా భాటియా అన్నారు.

READ MORE  2025 టాటా టియాగో , ఎంజీ కామెట్ ఈవీ మ‌ధ్య తేడాలు ఏంటి… ఏది బెస్ట్‌?

ఇదిలా ఉండగా, సర్వోటెక్ పవర్ సిస్టమ్స్, BPCL గతంలో కలిసి పనిచేశాయి. నవంబర్ 2023లో, BPCL  E-డ్రైవ్ ప్రాజెక్ట్ కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో 2,649 AC EV ఛార్జర్‌లను సరఫరా చేయడానికి ఇన్‌స్టాల్ చేయడానికి కంపెనీ ఆర్డర్‌ను పొందింది . సర్వోటెక్ ఇప్పటికే 36% సరఫరా ఇన్ స్టాాలేషన్ ను పూర్తి చేసింది. ఈ మొత్తం ప్రాజెక్ట్ మార్చి 2024 నాటికి పూర్తవుతుంది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

READ MORE  2025 టాటా టియాగో , ఎంజీ కామెట్ ఈవీ మ‌ధ్య తేడాలు ఏంటి… ఏది బెస్ట్‌?

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..