Avenairs All season Mobility EV: అమెరికా కు చెందిన స్టార్టప్ అవెనైర్ (Avenair Textus) తన వినూత్నరీతిలో కనిపించే ఆల్-సీజన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ టెక్టస్ (Tectus)ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జితో 160 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ వాహనంలో సోలార్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. కాగా కంపెనీ డీలక్స్, అల్టిమేట్ అనే రెండు వేరియంట్లలో EVని పరిచయం చేసింది. అంతేకాకుండా , ఇది సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లను కలిగి ఉంది.
ఎంట్రీ-లెవల్ టెక్టస్ డీలక్స్ వేరియంట్ ధర $ 6,995 (సుమారు రూ. 5.79 లక్షలు), టాప్ వేరియంట్ టెక్టస్ అల్టిమేట్ ధర $8,999 (సుమారు రూ. 7.45 లక్షలు)గా ఉంది.. అయితే Textus బుకింగ్ ని కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. కొనుగోలుదారులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా $100 (సుమారు రూ. 8284) టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ-స్కూటర్ డెలివరీల గురించి కంపెనీ వివరాలు వెల్లడించలేదు.
సీనియర్ సిటిజన్లకు..
Avenair Tectus : వృద్ధులు, నగరాల్లో తక్కువ వేగంతో ప్రయాణించే వారి కోసం ఈ వినూత్నమైన ఎలక్ట్రిక్ వాహనాన్ని కంపెనీ రూపొందించింది. దాని ప్యాక్ క్యాబిన్ ఎప్పుడైనా, ఎక్కడైనా రైడ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. దీన్ని ఆల్-వెదర్ ఆన్-రోడ్, ఆఫ్-రోడ్ మొబిలిటీ స్కూటర్ గా చెప్పవచ్చు.. కొత్త స్కూటర్‌లో వివిధ రకాల స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ లను అందించింది. అందువల్ల స్కూటర్ ఎక్కువ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. Avenair Textus మూడు కలర్ ఆప్షన్స్.. ఎరుపు, నీలం, నలుపు లో అందుబాటులో ఉంది.
Avenair Textus స్పెసిఫికేషన్స్..
ఎలక్ట్రిక్ స్కూటర్ డీలక్స్ టాప్ వేరియంట్ A/C, హీటర్ ను కలిగి ఉంది. అయితే, అల్టిమేట్ రివర్స్ ఫంక్షన్, స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, హాట్ – కోల్డ్ కప్ హోల్డర్స్, స్టీరియో సౌండ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, కీలెస్ ఎంట్రీ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఇన్‌బిల్ట్ జీపీఎస్ట్రా కింగ్, అలారం వాచ్, బ్యాకప్ కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లతో వస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, ట్రికిల్ సోలార్ ఛార్జింగ్, రెండు గంటల ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో చూేచ్చు.. ఉన్నాయి.
Avenairs ఇ-స్కూటర్ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సెటప్‌తో 2 kW డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చారు. దీని గరిష్ట వేగం గంటకు కేవలం 32 కి.మీ మాత్రమే… ఎలక్ట్రిక్ మోటార్‌కు శక్తినివ్వడానికి, డీలక్స్ వేరియంట్‌లో 2.4kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది., అల్టిమేట్ వేరియంట్‌లో 5.4kWh కూడా అందుబాటులో ఉంది. ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్ పెడితే చాలు 160 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.
[…] […]