
Komaki Flora electric scooter : ధ్యతరగతి వినియోగదారుల కోసం కొమాకి ఈవీ కంపెనీ Komaki Electric Flora పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మళ్లీ అప్ డేట్ చేసి తక్కువ ధరలకే విడుదల చేసింది. Flora ఒక Lithium Ion Ferro Phosphate (LiFePO4) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. దీనిని స్కూటర్ నుంచి విడదీసి చార్జింగ్ పెట్టుకునే వీలు ఉంటుంది. అపార్ట్ మెంట్లలో ఉండేవారు దీన్ని ఛార్జ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది, అయితే పూర్తి ఛార్జ్‌పై 85 నుండి 100కిమీల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. కోమాకి ఫ్లోరా స్కూటర్లు జెట్ బ్లాక్, గార్నెట్ రెడ్, స్టీల్ గ్రే, శాక్రమెంటో గ్రీన్ అనే నాలుగు రంగులలో అందుబాటులో ఉన్నాయి . స్కూటర్ స్టీల్ ఛాసిస్‌తో నిర్మించబడింది.
అప్‌డేట్ చేయబడిన Komaki Flora electric scooter సెల్ఫ్ డయాగ్నొస్టిక్ మీటర్, అదనపు బ్యాక్‌రెస్ట్, పార్కింగ్, క్రూయిజ్ కంట్రోల్, బూట్ స్పేస్‌తో సౌకర్యవంతమైన సీటుతో కూడిన కొత్త డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉంటుంది. స్కూటర్‌లో ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుకవైపు డ్రమ్ బ్రేక్ ఉన్నాయి.
Komaki ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా, Flora రీ లాంచ్ పై మాట్లాడుతూ.. “మా అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్, Floraని తిరిగి ప్రారంభించడం సంతోషంగా ఉంది. దేశంలోని క్లీన్ మొబిలిటీ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులను సృష్టిస్తుంది. ఇది స్థిరమైన శక్తి పరివర్తనకు గణనీయంగా దోహదపడుతుంది. ” అని తెలిపారు.
” ఫ్లోరా మోడల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ భవిష్యత్తును పునర్నిర్వచించడమే కాకుండా దేశవ్యాప్తంగా Electric Vehicles ఎంపికల వైపు సానుకూల మార్పును ప్రేరేపిస్తుందని మేము నమ్ముతున్నామ తెలిపారు.
పూర్తి వివరాలకు కొమాకీ కంపెనీ వెబ్ సైట్ ను సందర్శించండి..
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.
Nice degine
Excellent
Superb & nice