Okaya Ferrato Disruptor | భారత్ లో ఎలక్ట్రిక్ వాహన రంగం దూసుకుపోతోంది. అనేక కంపెనీలు సరికొత్త ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లతోపాటు హైస్పీడ్ ఈ-బైక్ లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. తాజాగా Okaya EV ఫెర్రాటో అనే కొత్త ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రకటించింది. ఇప్పుడు, ఈ కొత్త బ్రాండ్ క్రింద విక్రయించబడే మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ పేరును ను కంపెనీ వెల్లడించింది. డిస్‌రప్టర్ (Disruptor) అని పిలువబడే ఒకాయ EV అధికారికంగా ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది.
Okaya Ferrato Disruptor Electric Bike మే 2, 2024న ఆవిష్కరించనుంది. అదే రోజున అధికారిక ధరలు కూడా వెల్లడించనుంది. ఈ కొత్త బైక్‌ను ఫెర్రాటో అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మొదటి 1000 మంది కొనుగోలుదారులు నామమాత్రపు టోకెన్ మొత్తం రూ. 500తో బైక్‌ను ప్రీ-బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆ తరువాత బుకింగ్ మొత్తం రూ. 2,500కి పెరుగుతుంది. ఇది కూడా పరిమిత సమయం మాత్రమే ఉంటుంది.
కొత్త ఎలక్ట్రిక్ బైక్ పై ఒకాయ EV మేనేజింగ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా మాట్లాడుతూ “ఈ ఎలక్ట్రిక్ బైక్ అద్భుతం సాటిలేని శక్తి, అత్యాధునిక డిజైన్, అధునాతన సాంకేతికతను మిళితం చేసి, స్పోర్ట్స్ బైక్ ఔత్సాహికులకు అభిమానులకు ఉల్లాసకరమైన రైడ్‌ను అందిస్తుందని తెలిపారు.
ఒకాయ ఫెర్రాటో డిస్‌రప్టర్ డిజైన్
Okaya Ferrato Disruptor Design : Okaya EV ఫెర్రాటో డిస్‌రప్టర్ కు సంబంధించిన టీజర్ ఇమేజ్‌ను కంపెనీ షేర్ చేసింది. ఇది ఫుల్-ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్‌గా కనిపిస్తుంది. ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్‌తో కూడిన రెడ్ కలర్ స్కీమ్ దాని స్పోర్టీ లుక్స్ ను మరింత మెరుగుపరుస్తుంది. ముందువైపు, ఆప్రాన్‌లో ట్విన్-LED హెడ్‌ల్యాంప్ సెటప్, పైన ఇంటిగ్రేటెడ్ విండ్‌స్క్రీన్ ఉన్నాయి. వెనుక భాగంలో, బైక్ స్ప్లిట్ గ్రాబ్ రైల్స్, పిక్సలేటెడ్ ఇంటర్నల్‌లతో కూడిన సింగిల్ పీస్ టెయిల్‌లాంప్‌ను కలిగి ఉంటుంది.
Disruptor Electric Bike Specifications : ఫెర్రాటో డిస్‌రప్టర్ స్పెసిఫికేషన్‌కు సంబంధించి ఒకాయ EV కొన్ని వివరాలను వెల్లడించింది. వీటిలో 3.97 kWh LFP బ్యాటరీ ప్యాక్ 129 కిమీ రేంజ్ ను అందిస్తుందని తెలిపారు. డిస్‌రప్టర్ 6.37kW PMS మోటార్‌తో వస్తుంది. ఇది 228 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. డిస్‌రప్టర్ గరిష్టంగా 95 kmph వేగంతో దూసుకెళ్తుంది. అందువల్ల, దాని పనితీరును బట్టి, ఇది 125cc-150cc పెట్రోల్ బైక్‌కు సమానంగా పరిగణించవచ్చు. ఒక కిమీకి 25 పైసల కంటే తక్కువ రన్నింగ్ కాస్ట్‌ను డిస్‌రప్టర్‌ను అందజేస్తుందని ఒకాయ కంపెనీ పేర్కొంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..
[…] […]