Ola Electric | ఏప్రిల్ 2024లో 52% మార్కెట్ (EV 2W segment ) వాటాతో 2W EV విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది ఏప్రిల్ నెలలో 34,000 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసి రికార్డు నమోదు చేసింది. ఏప్రిల్లో భారతదేశంలో అమ్ముడైన ప్రతి రెండు 2W EVలలో ఒకటి Ola S1 ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
బెంగళూరు: ఏప్రిల్ 2024లో EV 2W విభాగంలో 52% మార్కెట్ (EV 2W segment) వాటాను స్వాధీనం చేసుకున్నట్లు Ola ఎలక్ట్రిక్ ఈరోజు ప్రకటించింది. దేశంలో మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది. ఈ నెలలో కంపెనీ 34,000 రిజిస్ట్రేషన్‌లను (ప్రభుత్వ వాహన పోర్టల్ ప్రకారం) నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 54% Y-o-Y వృద్ధిని నమోదు చేసింది.
ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. “2W EV విభాగంలో మా మార్కెట్ వాటా 52% మార్కును అధిగమించడం ద్వారా FY25కి ఇది అద్భుతమైన ప్రారంభం అని అన్నారు. మేము ఏప్రిల్ నెలలో మా రెండవ ఆల్-టైమ్ హై రిజిస్ట్రేషన్‌లను రికార్డ్ చేసాము. మా బలమైన వ్యయ నిర్మాణాలు, ఉత్పాదక సామర్థ్యాలు మా మార్కెట్ వాటాలో ఈ పెరుగుదలకు సమష్టిగా దోహదపడ్డాయి. మా మాస్-మార్కెట్ S1 X పోర్ట్‌ఫోలియో డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. మేము భారతదేశంలో మాస్ మార్కెట్ 2W EV విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాము. అని పేర్కొన్నారు.
E-Bike | కిలోమీటర్ కు 25 పైసల కంటే తక్కువ ఖర్చు.. మార్కెట్ లోకి సరికొత్త ఎలక్ట్రకి్ బైక్ వస్తోంది..
Ola ఎలక్ట్రిక్ ఇటీవల మాస్-మార్కెట్ విభాగంలోకి ప్రవేశించింది. కాగా ఓలా S1 X పోర్ట్‌ఫోలియో కోసం కొత్త ధరలను ప్రకటించింది. మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లలో (2 kWh, 3 kWh, 4 kWh) అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ ఇప్పుడు వరుసగా INR 69,999 (పరిచయ ధర), INR 84,999, INR 99,999 ధరల్లోకొనుగోలు చేయవచ్చు. త్వరలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కంపెనీ తన ప్రీమియం ఆఫర్‌లైన S1 ప్రో, S1 ఎయిర్, S1 X+ ధరలను వరుసగా INR 1,29,999, INR 1,04,999 మరియు INR 84,999కి సవరించింది.
మరోవైపు Ola ఎలక్ట్రిక్ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 8-సంవత్సరాల/80,000 కిమీ ఎక్స్ టెండెట్ బ్యాటరీ వారంటీని కూడా అందిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ వాహనాల వారంటీని పొడిగించడం ద్వారా EV స్వీకరణకు ఉన్న అడ్డంకులను పరిష్కరించినట్లైంది. వినియోగదారులు యాడ్-ఆన్ వారంటీని కూడా ఎంచుకోవచ్చు. 1,00,000 కి.మీ వరకు ప్రయాణించే కిలోమీటర్ల గరిష్ట పరిమితిని రూ.4,999కి, రూ.1,25,000 కి.మీల వరకు రూ.12,999కి పెంచుకోవచ్చు. Ola ఎలక్ట్రిక్ 3KW ఫాస్ట్ ఛార్జర్ ను కూడా పరిచయం చేసింది, ఇది రూ.29,999కు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..