Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Electric Bus | ఇప్పుడు భారత్ లో అత్య‌ధిక ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ఉన్న న‌గ‌రం ఇదే..

Spread the love

Electric Bus | భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ బస్సులను కలిగి ఉన్న మొదటి నగరంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా మూడవ నగరంగా న్యూఢిల్లీ అవతరించింది. ఈమేర‌కు మంగళవారం ఢిల్లీలో కొత్త‌గా 320 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి, నగరంలో ప్ర‌స్తుతం ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ సంఖ్య 1,970కి చేరుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల రాక‌పోక‌ల‌తో ఢిల్లీ కాలుష్యంపై పోరాటానికి బలం చేకూరుస్తుందని బాన్సెరాలో జరిగిన ఫ్లాగ్-ఆఫ్ కార్యక్రమంలో వీకే సక్సేనా చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. “మేము 320 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తున్నాం. ఇవి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయి. రాబోయే కాలంలో, ఇటువంటి మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఢిల్లీలో కాలుష్యం తగ్గించాల్సిన అవసరం ఉంటే, ప్రజా రవాణాను బలోపేతం చేయాలని నేను భావిస్తున్నాను. ఈ దిశగా కలిసి పనిచేస్తున్న కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు దీనిని ముందుకు తీసుకెళ్లాలన్నదే మా ప్రయత్నం. అని అన్నారు.

ఎక్కువ‌గా ఎల‌క్ట్రిక్, సీఎన్జీ బస్సులే..

ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (DTC ) ఫ్లీట్‌లో మొత్తం 7,683 బస్సులు(Electric Bus) ఉన్నాయని, ఇందులో 1,970 ఎలక్ట్రిక్ బస్సులు, మిగిలిన సిఎన్‌జి బస్సులు ఉన్నాయని విలేకరుల సమావేశంలో మంత్రి కైలాష్ గెహ్లాట్ వెల్ల‌డించారు. “DTC లో ఇది అత్యధిక సంఖ్యలో బస్సులు. కామన్వెల్త్ గేమ్స్ సమయంలో కూడా, ఫ్లీట్ సుమారు 5,500 బస్సులను కలిగి ఉంది. ఇది ఒక ముఖ్యమైన మైలురాయి” అని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల విమానాశ్ర‌యాల్లో 25 శాతం ఎలక్ట్రిక్ బస్సులు ఉండాలనే లక్ష్యాన్ని చేరుకున్నామని ఆయన చెప్పారు. సిసిటివి కెమెరాలు, పానిక్ బటన్‌లతో కూడిన ఈ బస్సులు డిఫరెంట్లీ-ఏబుల్డ్ ఫ్రెండ్లీగా ఉన్నాయని గహ్లోట్ చెప్పారు. 2025 చివరి నాటికి ఢిల్లీలో మొత్తం 10,480 బస్సులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో 80 శాతం ఎలక్ట్రిక్‌గా ఉంటాయని ఆయన తెలిపారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *