Chilli Price | ఆగని ‘ఎర్ర బంగారం’ జోరు.. వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹38,000!

Chilli Price | ఆగని ‘ఎర్ర బంగారం’ జోరు.. వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹38,000!

Agriculture News Warangal Market : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నిన్నటి రికార్డును బ్రేక్ చేస్తూ, ఈరోజు (05-02-2026) వండర్ హాట్ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్టంగా ₹38,000 పలికింది.

నేటి ప్రధాన పంటల ధరల పట్టిక (05.02.2026)

పంట రకంగరిష్ట ధర (Max)కనిష్ట ధర (Min)మోడల్ ధర
వండర్ హాట్ మిర్చి₹38,000₹14,500₹28,000
యుఎస్ (US) 341 మిర్చి₹26,700₹12,500₹24,500
దీపిక మిర్చి₹27,000₹27,000₹27,000
తేజ మిర్చి₹19,500₹11,500₹17,000
పత్తి (Cotton New)₹7,630₹6,000₹7,000
మినుములు (Black Gram)₹8,602₹8,602₹8,602
పెసర్లు (Green Gram)₹8,352₹7,722₹8,352

నిన్నటితో పోలిస్తే ధరలు ఇలా..

వండర్ హాట్ మిర్చి: నిన్నటి గరిష్ట ధర ₹37,100 కాగా, ఈరోజు (గురువారం ) అది ₹900 పెరిగి ₹38,000 కు చేరింది.
US 341: బుధవారం ₹26,200 పలికిన ఈ రకం, నేడు ₹500 పెరిగి ₹26,700 వద్ద ట్రేడ్ అవుతోంది.
పత్తి ధర: పత్తి ధరలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. నిన్నటి గరిష్ట ధర ₹7,700 ఉండగా, నేడు అది ₹7,630 కి (₹70 తగ్గుదల) పడిపోయింది.

మిర్చి రాక‌ (Arrivals): ఈరోజు మిర్చి మొత్తం రాకడ సుమారు 5,050 బస్తాలుగా ఉంది. ఇది నిన్నటి (13,111 బస్తాలు) కంటే గణనీయంగా తగ్గింది. రాకడ తగ్గడం కూడా ధరలు పెరగడానికి ఒక కారణంగా కనిపిస్తోంది.

వరుసగా రెండు రోజులుగా మిర్చి ధరలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వండర్ హాట్, 341 రకాలను సాగు చేసిన రైతులకు మంచి లాభాలు అందుతున్నాయి. అయితే పత్తి ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా లేక స్వల్పంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం.


మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.  

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్  కోసం  X , ఫేస్​బుక్​ పేజీ, వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు