Harithamithra Telugu News

Home Agricultue సేంద్రియ వ్యవసాయం వరంగల్ మార్కెట్లో రూ. 40,000 మార్కును దాటిన మిర్చి..

వరంగల్ మార్కెట్లో రూ. 40,000 మార్కును దాటిన మిర్చి..

0
Warangal Enumamula Market Prices

ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పేరొందిన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో ఎర్ర బంగారం మరోసారి రికార్డులను తిరగరాసింది. గురువారం (05-02-2026) జరిగిన క్రయవిక్రయాల్లో మిర్చి ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా దేశీ రకం మిర్చి క్వింటాల్‌కు ఏకంగా రూ. 40,000 మార్కు (Desi Chilli Record Price) ను దాటేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

నేటి మార్కెట్‌లో వివిధ రకాల మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Today Chilli Prices : దేశీ మిర్చి నేడు మార్కెట్‌లో అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 40,005 పలికింది. దీని మోడల్ ధర రూ. 25,000 గా నమోదైంది.
వండర్ హాట్: ఈ రకం మిర్చి గరిష్టంగా రూ. 38,000 పలికి రైతులను ఆశ్చర్యపరిచింది. దీని మోడల్ ధర రూ. 23,000.
యుఎస్ 341: క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 26,700 పలికింది.
తేజ మిర్చి: మార్కెట్‌కు అత్యధికంగా 3,992 బస్తాల రాకడ రాగా, గరిష్ట ధర రూ. 19,500 వద్ద స్థిరంగా ఉంది.
దీపిక: ఈ రకం గరిష్టంగా రూ. 27,000 పలికింది.

పత్తి, ఇతర పంటల ధరలు:

కొత్త పత్తి గరిష్టంగా రూ. 7,630 పలకగా, సి.సి.ఐ (CCI) ద్వారా కొనుగోలు చేసిన పత్తికి రూ. 8,010 లభించింది. పల్లికాయ (తడి) రకానికి గరిష్టంగా రూ. 9,300 ధర లభించింది.
చిరుధాన్యాలు & ఇతరాలు: కందులు రూ. 7,978, పెసర్లు రూ. 8,352, మినుములు రూ. 8,602 గా నమోదయ్యాయి.

Warangal AMC Market Report | Feb 5, 2026

వ్యవసాయ ఉత్పత్తుల పేరుగరిష్ట ధర (Max)కనిష్ట ధర (Min)మోడల్ ధర
మిర్చి – వండర్ హాట్₹38,000₹15,000₹23,000
మిర్చి – దేశీ₹40,005₹15,000₹25,000
మిర్చి – తేజ₹19,500₹14,000₹17,500
మిర్చి – US 341₹26,700₹12,500₹23,500
మిర్చి – దీపిక₹27,000₹16,000₹27,000
పత్తి (కొత్త పత్తి)₹7,630₹6,000₹7,000
వేరుశనగ (పల్లికాయ – సుక)₹9,300₹6,500₹8,910
కందులు₹7,978₹7,069₹7,978
పెసర్లు₹8,352₹7,722₹7,352
మినుములు₹8,602₹8,602₹8,602
మక్కలు₹1,955₹1,650₹1,855

ఈరోజు మార్కెట్‌కు మొత్తం 12,893 బస్తాల మిర్చి రాకడ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న డిమాండ్, స్థానిక మార్కెట్‌లో తక్కువ రాకడ ఉండటం వల్లే ధరలు ఇంత భారీగా పెరుగుతున్నాయని ప‌లువురు భావిస్తున్నారు. ముఖ్యంగా నాణ్యమైన దేశీ, వండర్ హాట్ రకాలకు వ్యాపారులు ఎగబడుతున్నారు.

Previous articleGlobal Solar Expo Telangana 2026 |హైదరాబాద్‌లో రేపటి నుంచే మెగా ఈవెంట్! దక్షిణ భారతంలోనే అతిపెద్ద సోలార్ ఎక్స్‌పో
Next articleవరంగల్ మార్కెట్‌లో రూ. 40,000 మార్కును తాకిన ‘దేశీ మిర్చి’.. వేరుశనగ ధరల్లోనూ జోరు!
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here