Ampere electric scooters

ఇక‌పై ఫ్లిప్‌కార్ట్‌లో Ampere electric scooters

Spread the love

గ్రీవ్స్ కాటన్ సంస్థ‌కు చెందిన ఇ-మొబిలిటీ వ్యాపార విభాగమైన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (GEM).. త‌న Ampere electric scooters ను మిలియన్ల మంది కస్టమర్‌లకు అందించడానికి స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. కస్టమర్‌లు తమ EV ప్రయాణాన్ని సజావుగా ప్రారంభించేందుకు భారతదేశ స్వదేశీ ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

ఇది మొదట ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆంపియర్ మాగ్నస్ EX ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించడం ప్రారంభించ‌నుంది.

ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఔత్సాహిక EV కొనుగోలుదారులను హై-స్పీడ్, శక్తివంతమైన, సరసమైన గ్రీన్ మొబిలిటీకి సౌకర్యవంతంగా మారడాన్ని ప్రోత్సహిస్తుంది. పైలట్ దశలో బెంగళూరు, కోల్‌కతా, జైపూర్, పూణేలోని కస్టమర్‌లు ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను యాక్సెస్ చేయగలరు. అలాగే రాష్ట్ర-నిర్దిష్ట సబ్సిడీలు, ఇత‌ర ప్రయోజనాలను కూడా పొందుతారు.

ఫ్లిప్‌కార్ట్‌లో Ampere electric scooters ఆర్డర్ చేసిన తర్వాత, RTO రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, స్కూటర్ డెలివరీ కోసం కస్టమర్‌లను స్థానిక అధీకృత డీలర్‌షిప్ సంప్రదిస్తుంది. ఆర్డర్ చేసిన సమయం నుండి డోర్‌స్టెప్ డెలివరీ వరకు మొత్తం ప్రక్రియ 15 రోజుల వ్యవధిలో పూర్తవుతుంది, కొనుగోలు అనుభవాన్ని కస్టమర్‌లకు సజావుగా, ఇబ్బంది లేకుండా చేస్తుంది.

ఈ విష‌య‌మై గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ బెహ్ల్ మాట్లాడుతూ.. “ఫ్లిప్‌కార్ట్ నుంచి త‌మ స్థానిక అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా సమగ్రమైన సేవతో అందుకోవ‌చ్చ‌ని తెలిపారు. గ్రీవ్స్‌లో వినియోగదారులకు క్లీన్, గ్రీన్, బెస్ట్-ఇన్-సెగ్మెంట్, లాస్ట్-మైల్ మొబిలిటీ అనుభవాన్ని అందించడానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ యూనిట్ హెడ్ రాకేష్ కృష్ణన్ మాట్లాడుతూ.. “పెరుగుతున్న ఆటోమేషన్, స్మార్ట్ ఛార్జింగ్ వంటివి నేడు ఆటోమొబైల్ పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చాయ‌ని తెలిపారు. EVలు వేగంగా అభివృద్ధి చెందుతున్న ట్రెండ్‌గా మారుతున్నాయి. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రజాదరణ పొందుతున్నాయి. వీటిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామ‌ని తెలిపారు. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీతో భాగస్వామిగా ఉండటానికి తాము సంతోషిస్తున్నామని తెలిపారు.

 

More From Author

BLive.. multi-brand EV store

స్మార్ట్ EV ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం BLive – Elocity భాగ‌స్వామ్యం

Carbon Se Azadi Mahotsav

Park+ నేతృత్వంలో Carbon Se Azadi Mahotsav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest

హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ ‌‌ – Vida Ubex Electric Motorcycle

Hero MotoCorp Vida Ubex Electric Motorcycle : హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్) సంస్థ‌ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం, విడా, వచ్చే నెలలో మిలన్‌లో జరగనున్న EICMA 2025లో తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బ్రాండ్ విడా ఉబెక్స్ అనే సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌ను...