లగ్జరీ EVల యాజమాన్యం లేకుండానే యాక్సెస్ — సరికొత్త మొబిలిటీ ఆవిష్కరణ
AMP Electric Vehicle Subscription India : లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయకుండానే ఉపయోగించాలనుకునే వారికోసం AMP సంస్థ భారతదేశపు తొలి ప్రీమియం ఎలక్ట్రిక్ వాహన సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫారమ్‌ను ఇటీవలే ప్రారంభించింది.
ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా BMW, మెర్సిడెస్, BYD, ఆడి, వోల్వో వంటి లగ్జరీ బ్రాండ్ల ఎలక్ట్రిక్ వాహనాలను సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో పొందవచ్చు.
ఎలక్ట్రిక్ యుగానికి కొత్త మార్గం
AMP తన కార్యకలాపాలను నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) లో ప్రారంభించి, రాబోయే 12 నెలల్లో 300 ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలనే ప్రణాళికను ప్రకటించింది. కంపెనీ వొచ్చే ఐదేళ్లలో కనీసం మరిన్ని ఐదు నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకు సాగుతోంది. ఈ సబ్‌స్క్రిప్షన్ మోడల్ ద్వారా వినియోగదారులు అధిక ముందస్తు ఖర్చులు, బ్యాటరీ రేంజ్ ఆందోళనలు, రీసేల్ వంటి అంశాలపై ఏ టెన్షన్ లేకుండా “యాజమాన్యం లేకుండా యాక్సెస్” అనే కొత్త అనుభవాన్ని పొందవచ్చు.
AMP యొక్క “యాన్యుటీ జనరేషన్ మోడల్” చిన్న, మధ్య తరహా సంస్థలకు వాహన తరుగుదలను ఆదాయ అవకాశాలుగా మార్చే ఆర్థిక పరిష్కారం అందిస్తుంది. కంపెనీ తన డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా వాహన ఎంపిక, సబ్‌స్క్రిప్షన్ మేనేజ్‌మెంట్, రియల్‌టైమ్ ట్రాకింగ్ వంటి అన్ని ప్రక్రియలను ఆన్‌లైన్‌లో సులభతరం చేస్తోంది. AMP చీఫ్ ఎలక్ట్రిక్ ఆఫీసర్ భరత్ బాలా మాట్లాడుతూ, “మా సేవ వినియోగదారులకు సౌలభ్యంతో పాటు పన్ను సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. ఇది రవాణా పరిష్కారం మాత్రమే కాదు, మొబిలిటీ రంగంలో ఆర్థిక ఆవిష్కరణ,” అని అన్నారు.
Electric Vehicle Subscription : సవాళ్లు – అవకాశాలు
భారత EV రంగం ఇంకా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, సర్వీస్ నెట్‌వర్క్‌లు లోపం వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే, AMP వంటి ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులకు కొనుగోలు నిర్ణయానికి ముందు ఎలక్ట్రిక్ వాహనాలను పరీక్షించే అవకాశం (Try before buy) అందిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల అభిరుచులు సౌకర్యవంతమైన యాజమాన్య మోడళ్ల వైపు మారుతున్న నేపథ్యంలో, AMP యొక్క ఆవిష్కరణాత్మక దృక్పథం “సస్టైనబుల్ మొబిలిటీ + ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ” కలయికను అందిస్తుంది. ఇది భారత ఆటోమోటివ్ రంగంలో సరికొత్త దశకు శ్రీకారం చుడుతోంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..



