- ఆంపియర్ ‘మాగ్నస్ గ్రాండ్ మాక్స్… రూ. 95 వేలకే 142 కి.మీ రేంజ్..
- పరిచయ ధర రూ. 94,999 (ఎక్స్-షోరూమ్)తో మార్కెట్లోకి ఎంట్రీ
- 3kWh LFP బ్యాటరీ.. 33 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్.
ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రముఖ ఈవీ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, తన ‘ఆంపియర్’ బ్రాండ్‌తో స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోంది. నెలవారీ విక్రయాల్లో ఇప్పటికే టాప్-6 ఓఈఎమ్ (OEM)లలో ఒకటిగా ఉన్న ఈ కంపెనీ, తాజాగా మాగ్నస్ గ్రాండ్ మాక్స్ (Magnus Grand Max ) పేరిట సరికొత్త, సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter)ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని పరిచయ ధరను రూ. 94,999 (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా నిర్ణయించారు.
Magnus Grand Max : బ్యాటరీ, పనితీరు..
మాగ్నస్ గ్రాండ్ మాక్స్ స్కూటర్ 3kWh సామర్థ్యం గల LFP (Lithium Iron Phosphate) బ్యాటరీతో వస్తుంది. ఇటీవలే లాంచ్ అయిన సుజుకి ఇ-యాక్సెస్ వలె, ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీలను ఉపయోగిస్తున్న అతికొద్ది కంపెనీలలో ఆంపియర్ ఒకటి. ఈ బ్యాటరీలు ఎన్‌ఎమ్‌సీ (NMC) బ్యాటరీల అంత శక్తి- ఎక్కవగా ఉండకపోయినా, ‘థర్మల్ రన్అవే’ (అగ్ని ప్రమాదాలు) జరిగే అవకాశం చాలా తక్కువ కాబట్టి అత్యంత సురక్షితమైనవి.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐడిసి (IDC) ప్రకారం 142 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. వాస్తవ పరిస్థితుల్లో (Real World) 100 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక చార్జింగ్ విషయానికొస్తే 20% నుండి 80% వరకు ఛార్జింగ్ కావడానికి 4.5 గంటల సమయం పడుతుంది.
పవర్‌ట్రెయిన్
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఈ స్కూటర్‌లో హబ్ మౌంటెడ్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 2.4kW పీక్ పవర్, 1.5kW పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు. రోజువారీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఎకో, సిటీ అనే రెండు రైడింగ్ మోడ్‌లను అందించారు. నగరాల్లో సులభంగా పార్కింగ్ చేసుకునేందుకు రివర్స్ మోడ్ కూడా ఇందులో ఉంది.
సస్పెన్షన్, బ్రేకింగ్ సెటప్‌ను సింపుల్‌గా కానీ ప్రాక్టికల్‌గా రూపొందించారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక వైపులా 130mm డ్రమ్ బ్రేక్‌లను అందించారు. ఇది హై-స్పీడ్ స్కూటర్ కాకపోయినా, రోజువారీ కమ్యూటింగ్‌కు సరిపడే స్థాయిలో భద్రతను అందిస్తుంది.
మాగ్నస్ గ్రాండ్ మాక్స్‌లో ముఖ్యంగా ఆకట్టుకునే అంశం 33 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్. ఇది ఇప్పటివరకు గ్రీవ్స్ లేదా ఆంపియర్ నుంచి వచ్చిన స్కూటర్లలోనే అతి ఎక్కువ స్టోరేజ్ స్థలంగా నిలుస్తోంది. ఈ ధర సెగ్మెంట్‌లో కూడా ఇది పెద్ద ప్లస్ పాయింట్. అదనంగా 3.5 అంగుళాల LCD డిస్‌ప్లే, మాన్‌సూన్ బ్లూ, మాచా గ్రీన్, సిన్నమన్ కాపర్ వంటి డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ధర పరంగా చూస్తే, రూ.94,999 ప్రారంభ ధరతో మాగ్నస్ గ్రాండ్ మాక్స్ ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో సరసమైన ఎంపికగా చెప్పవచ్చు. TVS ఆర్బిటర్, బజాజ్ చేతక్ C2501, విడా VX2 గో వంటి స్కూటర్లతో ఇది పోటీ పడుతోంది. ఫీచర్లు, బ్యాటరీ భద్రత, పెద్ద స్టోరేజ్ వంటి అంశాలు ఈ మోడల్‌కు అదనపు బలంగా ఉన్నాయి.
మొత్తంగా, ఈ కొత్త మోడల్ లాంచ్ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి అమ్మకాల పరంగా మరింత ఊపునిచ్చే అవకాశముంది. ప్రస్తుత మార్కెట్ ధోరణులు కొనసాగితే, తగ్గుతున్న అమ్మకాలతో ఇబ్బంది పడుతున్న ఓలా ఎలక్ట్రిక్‌ను దాటుకుని భారత ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ఐదవ స్థానానికి చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Magnus Grand Max Electric Scooter Specifications
| ఫీచర్ (Feature) | వివరాలు (Specifications) |
| బ్యాటరీ రకం (Battery Type) | LFP (Lithium Iron Phosphate) – అత్యంత సురక్షితం |
| బ్యాటరీ సామర్థ్యం | 3 kWh |
| సర్టిఫైడ్ రేంజ్ (IDC) | 142 కి.మీ (ఒక్క ఛార్జ్ పై) |
| రియల్ వరల్డ్ రేంజ్ | 100 కి.మీ కంటే ఎక్కువ (ఎకో మోడ్‌లో) |
| గరిష్ట వేగం (Top Speed) | 65 కి.మీ/గం |
| మోటార్ పవర్ (Peak) | 2.4 kW (హబ్ మౌంటెడ్ మోటార్) |
| మోటార్ పవర్ (Nominal) | 1.5 kW |
| రైడింగ్ మోడ్స్ | Eco, City, Reverse |
| ఛార్జింగ్ సమయం | 0-80% వరకు 4.5 గంటలు (హోమ్ ఛార్జర్) |
| బ్రేక్స్ (Brakes) | ఫ్రంట్ & రియర్: 130mm డ్రమ్ బ్రేక్స్ (CBSతో) |
| సస్పెన్షన్ (Suspension) | టెలిస్కోపిక్ (ముందు), ట్విన్ షాక్ అబ్జార్బర్స్ (వెనుక) |
| స్టోరేజ్ (Boot Space) | 33 లీటర్లు (అతిపెద్ద అండర్ సీట్ స్టోరేజ్) |
| గ్రౌండ్ క్లియరెన్స్ | 165 mm |
| వీల్ సైజ్ | 12 ఇంచులు |
| లోడింగ్ కెపాసిటీ | 150 కిలోలు |
| వారంటీ (Warranty) | 5 ఏళ్లు లేదా 75,000 కి.మీ (బ్యాటరీపై) |
| రంగులు (Colours) | మాన్‌సూన్ బ్లూ, మాచా గ్రీన్, సిన్నమోన్ కాపర్ |
| ధర (Price) | రూ. 94,999 (పరిచయ ధర, ఎక్స్-షోరూమ్) |





