Aponyx electric scooters | దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవం కొనసాగుతోంది. ఫలితంగా అనేక కొత్త ఆటో OEM లు స్థాపితమవుతున్నాయి. తాజాగా కొత్త ఈవీ బ్రాండ్ అపోనిక్స్ (Aponyx ) మార్కెట్ లోకి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్‌లను విడుదల చేయడానికి సిద్ధమైంది. కొత్త వినూత్నమైన ఈవీలు దేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీని మెరుగుపరచనున్నాయని కంపెనీ చెబుతోంది.
ఈ కంపెనీ గుజరాత్‌లోని సూరత్‌లో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని సిద్ధం చేస్తోంది. ఇది స్కూటర్ తయారీలో స్థానికకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తోంది. అంటూ ఈ కంపెనీ వాహనాలన్నీ ఇండియాలోనే పూర్తిగా తయారు కానున్నాయి. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పర్యావరణ అనుకూల రవాణాలో భారీ ముందడుగు వేయనున్నాయని అపోనిక్స్ తెలిపింది.
స్థిరమైన, జీరో కార్బన్ రవాణా ను దోహదం చేసే పర్యావరణ హితమైన భవిష్యత్తును సృష్టించే దృక్పథంతో, అపోనిక్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సెక్టార్‌లోకి ప్రవేశించింది . ఈ వాహనాలు ప్రయాణ అనుభవాన్నిసమూలంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి. చక్కని పనితీరు, డిజైన్, పర్యావరణ స్పృహ వంటి లక్షణాల కలయికతో ఈ స్కూటర్లు రానున్నాయి.
త్వరలో విడుదల కానున్న ఈ ఉత్పత్తి కోసం ఎదురుచూస్తున్నట్లు అపోనిక్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వ్యవస్థాపకుడు ,ఛైర్మన్ MS చుగ్ పేర్కొన్నారు. “అపోనిక్స్‌లో, మెరుగైన భవిష్యత్తును రూపొందించడానికి స్థిరమైన ఆవిష్కరణలను తీసుకొస్తున్నామని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న మా హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పర్యావరణ అనుకూల చైతన్య పరిష్కారాలను అందించడంలో మైలురాయిగా నిలుస్తాయి.
Aponyx electric scooters Features : అపోనిక్స్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ వాహనా ల్లో కొన్ని ప్రామాణికమైన, కీలకమైన ఫీచర్లు దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్, స్మార్ట్ కనెక్టివిటీని కలిగి ఉంటాయి. అదనంగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క సొగసైన ఆధునిక డిజైన్.. రైడర్ అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా స్టైలిష్ , ఫ్యూచరిస్టిక్ అర్బన్ ల్యాండ్‌స్కేప్‌కు సరిగ్గా సూట్ అవుతుందని తెలిపారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..