Ather Energy 25th experience centre..

Spread the love

Ather Energy 25వ ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ :  ప్రముఖ ఈవీ కంపెనీ.. Ather Energy తన కొత్త రిటైల్ అవుట్‌లెట్‌ను ఇటీవలే గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో ప్రారంభించింది. ఈ ఏడాది అహ్మ‌దాబాద్‌లో మొదటి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే.  అయితే సూర‌త్‌లోని ఈ కేంద్రం గుజరాత్ రాష్ట్రంలో ఏథ‌ర్ కంపెనీ ప్రారంభించిన త‌న రెండో రిటైల్ అవుట్‌లెట్ అవుతుంది.  గుజ‌రాత్ రాష్ట్రంలో ఏథర్ 450X, 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఫుల్‌గా డిమాండ్ ఏర్ప‌డింది. వినియోగదారుల డిమాండ్ కారణంగా త‌మ ఔట్‌లెట్‌ల‌ను విస్తరిస్తున్న‌ట్లు కంపెనీ పేర్కొంది.  గుజరాత్ రాష్ట్రంలో ఈవీల‌పై స‌బ్సిడీ ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి అహ్మదాబాద్ స్టోర్‌లో దాదాపు 8 రెట్లు డిమాండ్ పెరిగిందని ఏథర్ ఎనర్జీ పేర్కొంది.  సూరత్‌లో కొత్తగా ప్రారంభించబడిన స్టోర్లో కస్టమర్‌లు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను సులువుగా కొనుగోలు చేసుకునే వీలు క‌లిగింది.

కొత్త ఎక్స్‌పీరియ‌న్స్ కేంద్రం (అనుభవ కేంద్రం) వాహనం యొక్క ప్రతి అంశం గురించి వినియోగదారులకు అవగాహన కల్పిస్తారు.  ప్రతి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని ప్ర‌తీ ఇంజినీరింగ్, మెకానికల్ అంశాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించుకోవ‌చ్చు. సూరత్ వాసులు ఇప్పుడు ఏథర్ స్టోర్‌ను సందర్శించే ముందు కంపెనీ వెబ్‌సైట్‌లో టెస్ట్ రైడ్ స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు.  కటారియా గ్రూప్ భాగస్వామ్యంతో ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించారు. ఏథర్ ఎనర్జీ సూరత్‌లో అథర్ గ్రిడ్ అనే రెండు ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ చేసింది. వీటిని అడాజన్, మగ్దల్లాలో చూడొచ్చు.

Ather Energy ఇప్పుడు ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగాన్ని సౌకర్యవంతంగా మార్చడానికి మరో 8 నుండి 10 చార్జింగ్ నెట్‌వ‌ర్క్‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని యోచిస్తోంది. Ather Energy భారతదేశం అంతటా FY22 చివరి నాటికి 500 Ather గ్రిడ్‌లను ఏర్పాటు చేయ‌ల‌ని లక్ష్యంగా పెట్టుకుంది. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ఏథ‌ర్ వాహ‌నాల‌తోపాటు ఇత‌ర అన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్‌లకు అందుబాటులో ఉంటుంది. ఇది డిసెంబర్ 2021 చివరి వరకు ఉచితంగా ఉంటుంది. Ather Energy భారతదేశంలోని ముఖ్య నగరాల్లో తన రిటైల్ ఫుట్‌ప్రింట్‌ను విస్తరించింది. ప్రస్తుతం దేశ‌వ్యాప్తంగా 21 నగరాల్లో 25 రిటైల్ దుకాణాలను తెరిచింది.

కంపెనీ మార్చి 2023 నాటికి 150 ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లతో 100 నగరాలకు విస్తరించాలని నిర్ణ‌చించుకుంది. FAME-II రివిజన్ తర్వాత ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,26,926 గా నిర్ణ‌యించారు. అయితే సూరత్‌లోని ఏథర్ 450 ప్లస్ ధర రూ. 1,07,916.

 

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..