Bajaj Freedom CNG Bike | ప్రపంచంలోనే మొట్టమొదటి CNGతో నడిచే బైక్ వ‌చ్చేసింది.. సీఎన్జీతో తిరుగులేని మైలేజీ

Bajaj Freedom CNG Bike
Spread the love

Bajaj Freedom CNG Bike | ఎన్నో రోజులుగా బైక్ లవర్స్  ఎదురుచూస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి CNG-తో పనిచేసే బైక్‌ వచ్చేసింది. బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో వ‌చ్చిన ఈ బైక్ పెట్రోల్‌తో పాటు సీఎన్జీతో కూడా పరుగులు పెడుతుంది. కేవలం  అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఒక బటన్ నొక్కడం ద్వారా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) నుంచి పెట్రోల్ కు  మారవచ్చు. CNGతో నడిచే కార్లు దశాబ్ద కాలంగా అందుబాటులో ఉన్నప్పటికీ, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీని  ఉపయోగించిన న‌డిచే మొట్టమొదటి బైక్ ఇదే.. ఈ బైక్ ధర బేస్ ‘డ్రమ్’ వేరియంట్ కోసం రూ.95,000 నుంచి ప్రారంభమవుతుంది.

కొత్త బైక్ కోసం బుకింగ్ విండో ఓపెన్ అయింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ గానీ, అధీకృత షోరూమ్‌ల ద్వారా బుక్ చేసుకోవ‌చ్చు. ఫ్రీడమ్ 125 మూడు వేరియంట్‌లలో విడుదల అయింది.  అవి NG04 డిస్క్ LED, NG04 డ్రమ్ LED అలాగే NG04 డ్రమ్. LED వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఐదు రంగుల్లో వ‌స్తున్నాయి. LED కాని డ్రమ్ వేరియంట్ రెండు రంగులలో అందుబాటులో ఉంది.

మూడు వేరియంట్ల (ఎక్స్-షోరూమ్) ధ‌ర‌లు ఇవీ..

  • NG04 డిస్క్ LED: రూ. 1,10,000
  • NG04 డ్రమ్ LED: రూ. 1,05,000
  • NG04 డ్రమ్: రూ. 95,000

బజాజ్ ఫ్రీడమ్ 125 ద్విచక్ర వాహన మార్కెట్‌ను విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకురానుంది. CNG వేరియంట్ తో రోజు వారీ ఇంధన ఖ‌ర్చు త‌గ్గిపోవ‌డ‌మే కాకుండా, వాతావ‌ర‌ణంలోకి తక్కువ ఉద్గారాలను విడుద‌ల చేస్తుంది. ఈ రెండూ భారతీయ ద్విచక్ర వాహన యజమానులకు కీలకమైన అంశాలు.

బైక్ కేవలం రెండు లీటర్ల స్టాండ‌ర్డ్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది. ఇది రిజర్వ్ ఇంధనంగా ఉపయోగపడుతుంది. బజాజ్ ఫ్రీడమ్ 125 ప్రతీ కిలో CNGకి 213 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అయితే రియల్ రేంజ్ సీఎన్జీ కిలోకు 117కి.మి పెట్రోల్  లీటర్ కు 65 కి.మి మైలేజీ ఇస్తుందని చెబుతున్నారు. కాగా  లాంచ్ సందర్భంగా కంపెనీ విడుదల చేసిన వీడియోలో ప్రదర్శించిన విధంగా బైక్ 11 భద్రతా పరీక్షలు నిర్వ‌హించిన‌ట్లు కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌ను ‘ట్రక్ రోల్‌ఓవర్ టెస్ట్’ చేయగా, ట్రక్ టైర్ల కింద బైక్ నలిగిపోయినప్పటికీ, సిఎన్‌జి ట్యాంక్ చెక్కుచెదరకుండా ఉంది.

Bajaj Freedom CNG Bike

స్పెసిఫికేషన్స్..

ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో కూడిన 125 cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో నడిచే ఫ్రీడమ్ 125 9.4 bhp మరియు 9.7 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ బైక్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ ఉన్నాయి, బ్రేకింగ్ ముందు వైపు డిస్క్ వెనుక వైపు డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇది 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది.

డిజైన్ పరిశీలిస్తే.. ఫ్రీడమ్ 125 DRLని కలిగి ఉన్న రౌండ్ హెడ్‌ల్యాంప్‌తో ఆధునిక-రెట్రో డిజైన్ ను కలిగి ఉంంది. ఫ్లాట్ సీట్, వెడల్పాటి హ్యాండిల్ బార్, న్యూట్రల్ రైడింగ్ పొజిషన్ కోసం సెంటర్-సెట్ ఫుట్ పెగ్‌లు ఉన్నాయి. సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను ఇందులో చూడవచ్చు. లో సీఎన్‌జీ ఇండికేట‌ర్‌, న్యూట్రల్ గేర్ ఇండికేట‌ర్ వంటివి డిస్ల్పేలో క‌నిపిస్తాయి.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *