E-bikes

Joy e-bike అమ్మ‌కాల్లో 502% వృద్ధి
E-bikes

Joy e-bike అమ్మ‌కాల్లో 502% వృద్ధి

అక్టోబర్ 2021లో Joy e-bike 502% అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. ఒక్క నెలోనే 2,855 ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లు విక్రయించి రికార్డు సృష్టించింది. జాయ్ ఇ-బైక్ తయారీదారు అయిన‌ వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్., అక్టోబర్ 2021 నెలలో తన సేల్స్ నివేదికను ప్రకటించింది.ఇండియాకు చెందిన Wardwizard Innovations & Mobility Limited సంస్థ జాయ్ ఇ-బైక్ బ్రాండ్ పేరుతో దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ విక్ర‌యిస్తోంది. కంపెనీ FY22 రెండవ త్రైమాసికానికి (జూలై- సెప్టెంబర్ 2021) తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జాయ్ ఇ-బైక్ గత నెలలో కంపెనీ భారీస్థాయిలో అమ్మకాలతో అక్టోబర్ 2021ని ముగించింది. 2021 అక్టోబర్‌లో యోవై ప్రాతిపదికన కంపెనీ 502 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇప్పటి వరకు ఏ త్రైమాసికంలోనూ ఇంత అత్యధిక ఆదాయాన్ని సాధించ‌లేదు.Joy e-bike అక్టోబర్ 2021లో భారతదేశంలో 2,855 యూనిట్ల ఎలక్ట్రిక్...
eBikeGo Rugged electric scooter.. భారీ క్రేజ్
E-bikes

eBikeGo Rugged electric scooter.. భారీ క్రేజ్

రెండు నెలల్లోనే లక్షకు పైగా బుకింగ్స్‌eBikeGo Rugged electric scooter : భారతదేశపు అతిపెద్ద స్మార్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ eBikeGo. ఇది ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు, బైక్‌ల‌ను అద్దెకు ఇస్తుంది. పర్యావరణ అనుకూలమైన రవాణా సౌక‌ర్యాల‌ను అందించేందుకు ఉద్దేశించిన ప్ర‌త్యేకమైన‌ స్టార్టప్‌లో eBikeGo ఒకటి. కొన్ని వారాల క్రితం ఈ కంపెనీ Rugged పేరుతో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. దీనికి మార్కెట్ నుండి అపూర్వ స్పందన వచ్చింది. కంపెనీ చెబుతున్న‌దాని ప్రకారం కొత్త eBikeGo రగ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రారంభించిన రెండు నెల‌ల్లోనే లక్ష యూనిట్లు బుకింగ్స్ వ‌చ్చిన‌ట్లు పేర్కొంది.కంపెనీ ప్రకారం eBikeGo ఇప్పటి వరకు Rugged electric scooter కోసం రూ.1,000 కోట్ల విలువైన 1,06,650 బుకింగ్‌లను సొంతం చేసుకుంది. ఇదే స‌మ‌యంలో కంపెనీ ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలో రగ్డ్ యొక్క మాస్టర్ ఫ్రాంచ...
70న‌గ‌రాల్లో Revolt RV 400 బుకింగ్స్‌..
E-bikes

70న‌గ‌రాల్లో Revolt RV 400 బుకింగ్స్‌..

 70న‌గ‌రాల్లో Revolt RV 400 బుకింగ్స్‌.. వ‌రంగ‌ల్‌, వైజాగ్‌, గుంటూరు, విజ‌య‌వాడ‌లో షోరూంలు రివోల్ట్ మోటార్స్ సంస్థ‌ కొత్త Revolt RV 400 బుకింగ్‌లను అక్టోబర్ 21న తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇప్పుడు భార‌త‌దేశ వ్యాప్తంగా 70 నగరాల్లో అందుబాటులో ఉంటుంది.రివోల్ట్ మోటార్స్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రివోల్ట్ RV 400 ను 2019 సంవత్సరంలో మర్కెట్లోకి విడుద‌ల చేసింది. ఇది దేశంలో వెంట‌నే ప్రాచుర్యం పొందింది. అయితే ఇప్పటి వరకు ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కేవలం 6 భారతీయ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నందున దాని పరిధి చాలా పరిమితంగా ఉండేది.  అంతేకాకుండా గత కొన్ని నెలలుగా దాని బుకింగ్‌లను మూసివేశారు. ఎందుకంటే ప‌రిమితికి మించి బుకింగ్స్ రావ‌డంతో కస్టమర్‌లకు స‌రైన స‌మ‌యంలో డెలివరీ చేయని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో కంపెనీ త‌న రివోల్...
Revolt RV400 క‌స్ట‌మ‌ర్ల‌కు శుభవార్త‌
E-bikes

Revolt RV400 క‌స్ట‌మ‌ర్ల‌కు శుభవార్త‌

 రివోల్ట్ బైక్కు కొత్త ఫీచ‌ర్ల‌ కీ అవ‌సరం లేకుండా స్వైప్ టూ స్టార్ట్ ఫీచ‌ర్Revolt RV400 ఎల‌క్ట్రిక్ బైక్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త. రివోల్ట్ మోటార్స్ సంస్థ‌ కీలెస్ మోటార్ ఆన్/ఆఫ్ ఫీచర్‌ను అందిస్తోంది.  రివాల్ట్ మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ త‌న మొట్ట‌ మొదటి రెండు మోటార్‌సైకిళ్లను 2019 లో విడుదల చేసింది.  అచ్చం పెట్రోల్ స్పోర్ట్స్ బైక్‌ను త‌లపించేలా వ‌చ్చిన ఈ బైక్‌కు వ‌చ్చిన క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ బైక్ పై వ‌చ్చిన డిమాండ్‌తో స‌ప్ల‌యి చేయ‌లేక రివోల్ట్.. బుకింగ్‌లను నిలిపివేయవలసి వచ్చింది. అయితే త‌న వినియోగారుల కోసం ఇప్పుడు కంపెనీ త‌న రివోల్ట్ ఆర్వీ 400ను అప్‌డేట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.  సెప్టెంబర్‌లో డెలివ‌రీ చేయ‌నున్న కొత్త Revolt RV400 బైక్‌లు స్మార్ట్‌ఫోన్ ఆధారిత కీలెస్ మోటార్ ఆన్/ఆఫ్ ఫీచర్‌తో వ‌స్తాయి.మోటార్‌సైకిల్‌ని స‌మీపించేట‌ప్పుడే తమ స్మార్ట్‌ఫోన్‌లో రివాల...
Ultraviolette Automotive నుంచి ప్రీమియం ఎల‌క్ట్రిక్ బైక్స్
E-bikes

Ultraviolette Automotive నుంచి ప్రీమియం ఎల‌క్ట్రిక్ బైక్స్

గంట‌కు 147కిలోమీట‌ర్ల వేగం సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్‌బెంగళూరుకు చెందిన Ultraviolette Automotive వ్యవస్థాపకులు నారాయణ్ సుబ్రహ్మ‌ణ్యం, నిరజ్ రాజ్‌మోహన్ గ్లోబల్‌గా అత్యంత విలాస‌వంతంమైన‌ ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌ల‌ను మార్కెట్‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. Ultraviolette F77 పేరుతో మొదటి ఎలక్ట్రిక్ ప్రీమియం మోటార్ బైక్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో విడుదల చేయనున్నారు. . F77 ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కనీస రైడింగ్ రేంజ్ 150 కిమీ ఉంటుంది. అయితే దీని ప్రారంభ ధ‌ర సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని నీరజ్ చెప్పారు. భారతదేశంలో ఇది అపాచీ, బజాజ్, కెటిఎమ్ వంటి బైక్‌ల‌తో Ultraviolette F77 పోటీపడ‌నుంది.గత మూడేళ్ల‌లో Ultraviolette Automotive మార్కెటింగ్ బృందాన్ని నిర్మించగలిగింది. బెంగళూరు సమీపంలోని తనేజా విమానాశ్రయం ట్రాక్‌పై Ultraviolette F77 బైక్ హై-స్పీడ్‌ను విస్తృతంగా ప‌రీక్షించింద...
Joy e-bikeపై య‌మ క్రేజీ
E-bikes

Joy e-bikeపై య‌మ క్రేజీ

గ‌త నెల‌లో 446% అమ్మకాల వృద్ధిప్రముఖ ఇ-బైక్ తయారీదారులు, వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ & మొబిలిటీ లిమిటెడ్ కు చెందిన‌ Joy e-bike పై యూత్‌లో విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. జూలై 2021 లో ఏకంగా 446% అమ్మకాల పెర‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. Joy e-bike ప్రస్తుతం హరికేన్, థండర్ బోల్ట్ మరియు స్కైలైన్ వంటి మోడ‌ల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి టాప్ స్పీడ్ 90 కి.మీ. ఉంటుంది.Joy e-bike జూలై 2021 లో పెద్ద‌మొత్తంలో అమ్ముడైన‌ట్లు వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ ప్రకటించింది. జూలై 2020 లో 173 యూనిట్ల‌ను విక్ర‌యించ‌గా ఈ ఏడాది జూలై లో 945 యూనిట్లను విక్రయించారు. మొత్తంగా 446 శాతం అమ్మకాల వృద్ధిని సాధించిన‌ట్లు కంపెనీ పేర్కొంది.ఒక‌వైపు వినియోగ‌దారుల్లో స్థిరమైన చైతన్యం , మ‌రోవైపు రోజురోజుకు ఇంధన ధరల పెరుగుద‌ల‌తో అంద‌రూ ఎల‌క్ట్రిక్ బైక్‌ల‌పై చూస్తున్నారు. ఈవీల‌పై ప్రచారాలతో, తమ రోజు...
మ‌రో ఎల‌క్ట్రిక్ మోపెడ్ వ‌స్తోంది.
E-bikes

మ‌రో ఎల‌క్ట్రిక్ మోపెడ్ వ‌స్తోంది.

యూలు సంస్థ నుంచి DEX electric scooter సింగిల్ చార్జిపై 60కి.మిస‌రుకుల డెలివరీ కోసం యులు సంస్థ ఓ ఎల‌క్ట్రిక్ మోపెడ్‌ను విడుద‌ల చేసింది. ఇది సింగిల్ చార్జిపై 60-కిమీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. దీనికి DEX electric scooterగా నామ‌క‌రణం చేశారు. యులు డిఎక్స్ అనేది చిరువ్య‌పారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిందని కంపెనీ పేర్కొంది. ఇది డెలివరీ బ్యాయ్‌ల ఇంధ‌న ఖర్చులను దాదాపు 35-40%వరకు తగ్గిస్తుందని పేర్కొంటున్నారు.ఇ-మొబిలిటీ సర్వీస్ ప్రొవైడర్ అయిన యులు తాజాగా ఫుడ్‌, మరియు కిరాణా మరియు ఔష‌ధాల‌ను డెలివ‌రీ చేసేందుకు ఈ DEX electric scooter ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 2021 నాటికి మొదటి దశలో బెంగళూరు, ముంబై మరియు ఢిల్లీ అంతటా 10,000 యులు DEX electric scooterల‌ను విక్ర‌యించ‌నుంది. ఈమేర‌కు అనేక ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది పూర్తిగా విద్య...
స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike
E-bikes

స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike

Quanta electric bike Gravton మోటార్స్ సంస్థ స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike ను ప్రారంభించింది. ఇది సింగిల్ చార్జిపై 120 కిలోమీటర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ప్రస్తుతానికి గ్రావ్టన్ క్వాంట హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.గ్రావ్టన్ మోటార్స్ అనే సంస్థ 2016లోనే స్థాపించబ‌డింది. ఐదేళ్ల త‌ర్వాత ప్ర‌స్తుతం స‌రికొత్త రూపంలో ఉన్న మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేయగలిగారు. అయితే ఇది వాహనం ఒక స్కూటర్, బైక్ మరియు మోపెడ్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంది. ఇది పూర్తిగా తెలంగాణలొనే రూపొందించబడింద‌ని గ్రావ్టన్ మోటార్స్ సీఈఓ పర‌శురాం పాకా తెలిపారు. ప్రస్తుతానికి గ్రావ్టన్ క్వాంట హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. గంట‌కు 70కి.మి వేగం Quanta electric bike లో లి-అయాన్ బ్యాటరీని వినియోగించారు. బ్యాటరీ 3kWh సామ‌ర్థ్యం క‌లిగి ఉంటుంది. ఇది 170Nm టార్క్ ను జ‌న‌రేట...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..