Monday, July 7Lend a hand to save the Planet
Shadow

Joy e-bikeపై య‌మ క్రేజీ

Spread the love

గ‌త నెల‌లో 446% అమ్మకాల వృద్ధి

Joy e-bike
Joy e-bike

ప్రముఖ ఇ-బైక్ తయారీదారులు, వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ & మొబిలిటీ లిమిటెడ్ కు చెందిన‌ Joy e-bike పై యూత్‌లో విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. జూలై 2021 లో ఏకంగా 446% అమ్మకాల పెర‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. Joy e-bike ప్రస్తుతం హరికేన్, థండర్ బోల్ట్ మరియు స్కైలైన్ వంటి మోడ‌ల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి టాప్ స్పీడ్ 90 కి.మీ. ఉంటుంది.

Joy e-bike జూలై 2021 లో పెద్ద‌మొత్తంలో అమ్ముడైన‌ట్లు వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ ప్రకటించింది. జూలై 2020 లో 173 యూనిట్ల‌ను విక్ర‌యించ‌గా ఈ ఏడాది జూలై లో 945 యూనిట్లను విక్రయించారు. మొత్తంగా 446 శాతం అమ్మకాల వృద్ధిని సాధించిన‌ట్లు కంపెనీ పేర్కొంది.

ఒక‌వైపు వినియోగ‌దారుల్లో స్థిరమైన చైతన్యం , మ‌రోవైపు రోజురోజుకు ఇంధన ధరల పెరుగుద‌ల‌తో అంద‌రూ ఎల‌క్ట్రిక్ బైక్‌ల‌పై చూస్తున్నారు. ఈవీల‌పై ప్రచారాలతో, తమ రోజువారీ ప్రయాణ అవసరాలను తీర్చడానికి ఎలక్ట్రిక్ టూవీలర్‌లపై వినియోగదారుల నుంచి డిమాండ్ పెర‌గ‌డాన్ని కంపెనీ గుర్తించింది ఈ క్ర‌మంలో త‌మ బ్రాండ్ పై పట్టణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల నుండి డిమాండ్ వ‌స్తోంద‌ని కంపెని చెబుతోంది. సానుకూల మార్కెట్ సెంటిమెంట్‌లతో ముందుకు సాగడం, ముఖ్యంగా రాబోయే పండుగ సీజన్‌లో అమ్మకాలు ఊపందుకుంటున్నట్లు వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్నేహా షౌచే తెలిపారు. వార్డ్‌విజార్డ్ ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 25 భారతీయ నగరాలకు విస్త‌రించామ‌ని తెలిపారు. త్వరలో ఈ సంఖ్యను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జాయ్ ఇ-బైక్ ప్రస్తుతం హరికేన్, థండర్ బోల్ట్ మరియు స్కైలైన్ వంటి మోడ‌ళ్ల‌ను క‌లిగి ఉంది.

 Joy e-bike ధ‌ర‌ల వివ‌రాలు

  • స్కైలైన్ – రూ .2,29,000
  • థండర్ బోల్ట్ – రూ .2,33,000
  • హరికేన్ – రూ .2,33,000
  • బీస్ట్ – రూ .2,42,000.

స్పెసిఫికేష‌న్స్ ఇవీ..

స్కైలైన్, థండర్ బోల్ట్, హరికేన్ మరియు బీస్ట్: ఎల‌క్ట్రిక్ బైక్‌లు గంట‌కు 90కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్తాయి.

ఇవి 5000 వాట్స్ డ్రైవ్ మోటార్ నుండి 230 Nm టార్క్ ఉత్ప‌త్తి చేస్తాయి. ఈ బైకులు లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంటాయి.

10 AMP స్మార్ట్ ఛార్జర్‌తో వస్తాయి, ఇది ఓవర్-వోల్టేజ్, షార్ట్-సర్క్యూట్ వంటి స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మిస్తాయి.

జాయ్ ఇ-బైక్స్ అన్నీ సింగిల్ చార్జిపై 110 కిమీలు ప్ర‌యాణిస్తాయి. చివరగా, ఒక కిలోమీట‌ర్‌కు రన్నింగ్ కాస్ట్ కేవలం 40 పైసలు మాత్రమే, ఇది ఇతర EV బైక్‌లతో పోలిస్తే ఎంతో మెరుగు.

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates