Home » eBikeGo Rugged electric scooter.. భారీ క్రేజ్

eBikeGo Rugged electric scooter.. భారీ క్రేజ్

ebikgo-Rugged-electric-scooter
Spread the love

రెండు నెలల్లోనే లక్షకు పైగా బుకింగ్స్‌

ebikeGo Rugged electric_scoote

eBikeGo Rugged electric scooter : భారతదేశపు అతిపెద్ద స్మార్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ eBikeGo. ఇది ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు, బైక్‌ల‌ను అద్దెకు ఇస్తుంది. పర్యావరణ అనుకూలమైన రవాణా సౌక‌ర్యాల‌ను అందించేందుకు ఉద్దేశించిన ప్ర‌త్యేకమైన‌ స్టార్టప్‌లో eBikeGo ఒకటి. కొన్ని వారాల క్రితం ఈ కంపెనీ Rugged పేరుతో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. దీనికి మార్కెట్ నుండి అపూర్వ స్పందన వచ్చింది. కంపెనీ చెబుతున్న‌దాని ప్రకారం కొత్త eBikeGo రగ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రారంభించిన రెండు నెల‌ల్లోనే లక్ష యూనిట్లు బుకింగ్స్ వ‌చ్చిన‌ట్లు పేర్కొంది.

కంపెనీ ప్రకారం eBikeGo ఇప్పటి వరకు Rugged electric scooter కోసం రూ.1,000 కోట్ల విలువైన 1,06,650 బుకింగ్‌లను సొంతం చేసుకుంది. ఇదే స‌మ‌యంలో కంపెనీ ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలో రగ్డ్ యొక్క మాస్టర్ ఫ్రాంచైజీలను కూడా మూసివేసింది. అలాగే eBikeGo ఒక కాస్ట్ & ఫ్రైట్ ఏజెంట్‌తో పాటు ఉత్తరప్రదేశ్, ముంబై, బీహార్‌లలో మొత్తం ఇరవై-రెండు డీలర్‌షిప్ స్టోర్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది. గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్‌తో సహా మరో పది రాష్ట్రాలకు తన పరిధిని విస్తరించాలని కంపెనీ భావిస్తోంది.

రెండు వేరియంట్లు ..

రాబోయే రోజుల్లో రూ.500కోట్ల విలువైన‌ విలువైన ‘రగ్డ్’ యొక్క 50,000 అదనపు బుకింగ్‌లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. eBikeGo రగ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ G1 అలాగే G1+ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ G1 ఒక్కసారి ఛార్జ్‌పై 80 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. దీని ఎక్స్‌షోరూం ధ‌ర ధర రూ. 84,999. మ‌రోవైపు G1+ వేరియంట్ సింగిల్ చార్జిపై 160 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. దీని ఎక్స్‌షోరూం ధ‌ర రూ. 1,04,999.

3.5గంట‌ల్లో ఫుల్ చార్జ్

ఇది డిటాచ‌బుల్ బ్యాట‌రీలు 2 x 2 kWhతో వస్తుంది. ఈ బ్యాటరీలు 3.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతాయి. సింగిల్ చార్జిపై సుమారు 160 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించ‌వ‌చ్చు. ఈ స్కూట‌ర్‌లో 30 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఇందులో 12 ఇంట‌ర్న‌ల్ స్మార్ట్ సెన్సార్లు ఉన్నాయి. రగ్డ్ యాప్ ఉపయోగించి వినియోగదారు స్కూటర్‌ను రిమోట్‌గా లాక్ /అన్‌లాక్ చేయవచ్చు. ఇందులో యాంటీ-థెఫ్ట్ ఫీచర్ కూడా పొందుప‌రిచారు. ఈబైక్‌గో స్కూట‌ర్‌లో కృత్రిమ మేధస్సుతో నడిచే ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. eBikeGo chassis పై ఏడు సంవత్సరాల వారంటీని అందిస్తోంది.

eBikeGo వ్యవస్థాపకుడు & CEO ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఇబైక్‌గో పరిచయం చేసిన రెండు నెలల్లోనే మా రగ్డ్ బైక్ ప‌ట్ల వినియోగదారుల నుంచి అపూర్వ స్పందనను ల‌భించింద‌ని తెలిపారు. దేశవ్యాప్తంగా 22 డీలర్‌షిప్‌లతో లక్షకు పైగా బుకింగ్‌లను పొందిన‌ట్లు వివ‌రించారు. ఇది ఏ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీకైనా ముఖ్యంగా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో కీల‌క‌మైన ప‌రిణామం అని పేర్కొన్నారు. త‌మ మన్నికైన ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్ దేశంలో ఇ-మొబిలిటీ దిశను మారుస్తుంది, ఎలక్ట్రిక్ బైక్ కేటగిరీలో ఆవిష్కరణల సరిహద్దులను ముందుకు తెస్తుంద‌ని తెలిపారు.

3 thoughts on “eBikeGo Rugged electric scooter.. భారీ క్రేజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *