
Eco friendly Ganesha | దేశమంతా వినాయక చవిత (Vinayaka Chavithi 2025) ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వాడవాడలా గణేష్ మండపాలను అందంగా అలంకరిస్తున్నారు. ముఖ్యంగా యూత్ వినియక నవరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే హిందూ పండగలు, సంస్కృతి సంప్రదాయాలను ముందుతరాలకు అందించడంతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతీ పండగ వెనక ఎంతో గొప్ప చరిత్ర ఉంటుంది. మన పండుగలు ప్రకృతిలో మమేకమవుతూ నేలా-నీరు, చెట్టూ చేమ సమస్త జీవరాశులను ఆరాధించడం గుర్తించవచ్చు. ఇది మన సంస్కృతిలో భాగంగా అనాదిగా కొనసాగుతూ వస్తోంది. అయతే ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు వచ్చాయి. కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులతో ఆకర్షనీయంగా కనిపించేలా తయారు చేసే విగ్రహాలను పూజించడం ఇకనైనా మానేద్దాం.. ఇలాంటి విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది. అందుకే పర్యావరణ హిత గణపతి ప్రతిమ(Clay Ganpati Murti) లనే పూజిద్దాం..
పీవోపీ విగ్రహాలతో కాలుష్యం
వివిధ రకాల హానికర రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే విగ్రహాల వల్ల తీవ్రమైన నీటి కాలుష్యం ఏటా పెరుగుతోంది. మన భక్తి వల్ల మరొకరికి ముప్పు వాటిల్లడం సరికాదు.. గొప్ప మనసుతో ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు.. మట్టి గణపతి (Eco friendly Ganesha Idols) కోసం దృఢ సంకల్పం తీసుకోవచ్చు. ఒకరిని చూసి మరొకరు గొప్పలకు పోయి భారీ విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ మనకు మనమే నష్టం చేసుకోవద్దు. తక్కువ ఖర్చుతో తక్కువ పరిమాణంలో ఉన్న విగ్రహాలను పూజిస్తూ పండగ చేసుకొని పది మందికి మంచిని పంచండి.
మండపాల ఏర్పాటు
మట్టి గణపతులను పూజించడంతోనే సరిపెట్టుకోకుండా వినాయక మండపాలను ఏర్పాటు చేయడంలోనూ ఉదారంగా వ్యవహరించాలి. రోడ్లన్నీ మూసుకుపోయేలా అడ్డదిడ్డంగా మండపాలు నిర్మించవద్దు. ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీధికో వినాయకుడిని ప్రతిష్టించకుండా కాలనీవాసులంతా కలిసి ఐకమత్యంతో ఒకే గణపతిని పెట్టుకుంటే.. దేవుడు కూడా దీవిస్తాడు. ఊరు వాళ్లంతా కలిసి ఒక్కటే విగ్రహాన్ని పూజిస్తే ఊరంతా ఒక్కటవుతుంది. అలాగే ప్రతిరోజు భక్తిపాటల పేరుతో భారీ శబ్దాలతో డీజే సౌండ్లు చేయకుండా సంయమనం పాటించండి.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. గూగుల్ న్యూస్ (Google News), తోపాటు X(ట్విట్టర్) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..