సరికొత్తగా EeVe Soul electric scooter
EeVe Soul electric scooter : భువనేశ్వర్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల స్టార్టప్, EeVe ఇండియా.. ఇటీవల తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వాహనం ఆవిష్కరణతో ఈ కంపెనీ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి ప్రవేశించినట్లైంది. కొత్త విడుదలైన EeVe సోల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర భారతదేశంలో రూ.1.40 లక్షలు. అయితే, ఈ ధరలో FAME II సబ్సిడీ అలాగే ఇతర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు ఉంటాయా లేదా అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో దశీయ రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.
EeVe Soul electric scooter స్పెసిఫికేషన్లు
కొత్త EeVe సోల్ ఎలక్ట్రిక్ స్కూటర్ సీటు కింద 2.2kWh రెండు అధునాతన లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలను పొందుపరిచారు. ఈ బ్యాటరీలను స్కూటర్ నుంచి విడదీసి చార్జింగ్ పెట్టుకోవచ్చు. వినియోగదారులు ఇంట్లో లేదా అపార్ట్‌మెంట్‌లలో బ్యాటరీని సౌకర్యవంతంగా ఛార్జ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇ-స్కూటర్ 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని ఈవీ కంపెనీ తెలిపింది. సోల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 60 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. అన్నంటికంటే మించి ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కి.మీల వరకు నడుస్తుందని EeVe తెలిపింది.
గంటకు 60కి.మి గరిష్ట వేగం..
అయితే, క్లెయిమ్ చేయబడిన 120 కిమీ పరిధిని మొదటి (ఎకో) మోడ్‌లో పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇక్కడ గరిష్ట వేగం గంటకు 40 కిమీకి పరిమితం చేయబడుతుంది. క్రమంగా దాని గరిష్ట వేగం 60 kmph వరకు అందుకుంటే దీని రేంజ్ తగ్గిపోతుంది.
ఇక ఫీచర్ల పరంగా EeVe సోల్ ఎలక్ట్రిక్ స్కూటర్ GPS నావిగేషన్, IOT ఫంక్షన్లు, USB పోర్ట్, యాంటీ-థెఫ్ట్ లాక్ సిస్టమ్, జియో-ట్యాగింగ్ మరియు జియో-ఫెన్సింగ్, రివర్స్ మోడ్, కీలెస్ స్టార్ట్ సెంట్రల్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తుంది. LED DRLలు, 90 సెక్షన్ 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్‌లతో కూడిన అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్‌లు అలాగే CBS (కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి కొన్ని ఇతర ముఖ్య ఫీచర్లు ఉన్నాయి.
EeVe ఇండియా సహ వ్యవస్థాపకుడు & డైరెక్టర్ హర్ష్ వర్ధన్ దిద్వానియా లాంచ్‌లో మాట్లాడుతూ, “పెరుగుతున్న పర్యావరణ సమస్యలకు పరిష్కారాన్ని అందించేందుకు భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని విప్లవాత్మకంగా మార్చడానికి EeVe ఇండియా కృషి చేస్తోందని పేర్కొంది. భవిష్యత్తు పరిశుభ్రంగా, సురక్షితంగా స్థిరంగా ఉండటానికి, తాము పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను తీసుకువస్తున్నామని తెలిపారు. మా తాజా EeVe ఎలక్ట్రిక్ స్కూటర్ అధిక వేగం, స్టైలిష్ గా ఉంటుందని తెలిపారు.
మరిన్ని అప్‌డేట్‌ల కోసం హరితమిత్ర వెబ్‌సైట్‌ను సందర్శించండి.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన వీడియోల కోసం మా Haritha mithra YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి..!
Wonderful