Ola S1 S1 pro : ఓలా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు శుభవార్త.. ప్రముఖ ఈవీ సంస్థ Ola.. తన ఓలా S1, ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగారులకు డెలివరీ చేసింది. కొత్త Ola S1, ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఈ ఏడాది ఆగస్టు 15న భారతదేశంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 99,999, రూ. 1,29,999. ఈ స్కూటర్లను లాంచ్ చేయకముందు కేవలం 24 గంటల్లోనే 1 లక్ష కంటే ఎక్కువ యూనిట్లను వినియోగదారులు
ప్రీ-బుక్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. ఓలా స్కూటర్‌ను అధికారికంగా ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఓలా S1, S1 ప్రో యొక్క డెలివరీలు ఎట్టకేలకు భారతదేశంలో ప్రారంభమయ్యాయి.
మొదటి బ్యాచ్ డెలివరీలు
ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ CEO – భవిష్ అగర్వాల్.. Ola S1 S1 pro ఎలక్ట్రిక్ స్కూటర్‌ల యొక్క మొదటి బ్యాచ్ ఓలా పరిశ్రమ నుంచి బయటకు వచ్చాయని తెలిపారు. అవి దేశవ్యాప్తంగా డెలివరీల కోసం దారిలో ఉన్నాయని వెల్లడించిన వీడియోను ట్వీట్ చేశారు. ఇప్పుడు, S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల మొదటి 50 మంది కస్టమర్ల కోసం ఓలా బెంగళూరులో ప్రత్యేక డెలివరీ కార్యక్రమాన్ని నిర్వహించింది. మొదటి బ్యాచ్ ఇ-స్కూటర్‌ల డెలివరీలు మొదట అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సి ఉంది. కాగా సరఫరా చైన్ సమస్యల కారణంగా ఆలస్యమైంది. ఎట్టకేలకు డిసెంబర్ 15న డెలివరీ షురూ అయ్యింది.
ఓలా స్కూటర్ల స్పెసిఫికేషన్లు
Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 90 kmph వేగంతో దూసుకెళ్తుంది. Ola S1 ప్రో స్కూటర్ 115 kmph గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. ఇక ధరల విషయానికొస్తే కొత్త Ola S1 స్కూటర్ ధర రూ. 99,999. అలాగే S1 ప్రో ఎలక్ట్రిక్ ధర రూ.1,29,999గా నిర్ణయించారు. ఈ ధరలు FAME II సబ్సిడీతో సహా అన్ని రాష్ట్రాలకు సంబంధించినవి. అన్ని రాష్ట్రాల కంటే గుజరాత్‌లో ఎక్కవగా సబ్సిడీ ఇస్తున్న కారణంగా అక్కడ Ola S1 ధర రూ. 79,999 కంటే తక్కువగా ఉంది. అలాగే Ola S1 ప్రో ధర రూ. 1,09,999గా ఉంది.
మరిన్ని అప్‌డేట్‌ల కోసం హరితమిత్ర వెబ్‌సైట్‌ను సందర్శించండి.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన వీడియోల కోసం మా Haritha mithra YouTubeHaritha mithra YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి..!
Great news
Nice