ఎలక్ట్రిక్ ఆటోను సౌరశక్తితో నడిచే వాహనంగా మార్చాడు

Spread the love

ఇంధనం లేకుండానే సాఫీ ప్రయాణం

Bhubaneswar : భువనేశ్వర్‌లోని ఒక ఆటో డ్రైవర్ తన ఎలక్ట్రిక్ ఆటోను సౌరశక్తితో నడిచే వాహనంగా మార్చేశాడు. దానిని అతను వీధుల్లో నడుపుతూ జీవనోపాధిని పొందుతున్నాడు. ఆటో డ్రైవర్ శ్రీకాంత్ పాత్ర  (Shrikant Patra) యూట్యూబ్ (Youtube) లో చూసి ఈ ఆవిష్కరణ చేశాడు.

దీనిపై శ్రీకాంత్ పాత్ర (35) మాట్లాడుతూ, “నేను గత 15 సంవత్సరాలుగా ఆటో రిక్షా నడుపుతున్నాను. ఇంతకుముందు, నేను డీజిల్, పెట్రోల్ కోసం భారీగా ఖర్చు చేసేవాడిని డీజిల్ ఇంజిన్‌తో రోజుకు ఇంధనం ఖర్చులు పోగా రూ. 300 నుంచి రూ.400 మాత్రమే సంపాదించాను. మేము పేదరికంలో జీవిస్తున్నాం. ఆటో ద్వారా వచ్చే డబ్బులతో ఇల్లు నడపలేం.. నా పిల్లలకు స్కూళ్ల ఫీజులను భరించలేను.”
“సుమారు ఒకటిన్నర సంవత్సరాల క్రితం, నేను ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను కొనుగోలు చేసి నగరంలో నడిపాను.. కానీ బ్యాటరీ తక్కువగా ఉండటం, ఛార్జింగ్ సమస్యతో ప్రతిరోజూ పెద్ద టెన్షన్ అయ్యేంది. ఇది నా సర్వీస్ ను తీవ్రంగా దెబ్బతీసింది. ఆ టైంలో రోడ్డుపై ఆటోను సరిగ్గా నడపలేకపోయాను. ”అతను తెలిపారు.

 electric auto into solar powered vehicle

“నగరంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోజువారీ బ్యాటరీ సమస్యల కారణంగా శ్రీకాంత్ పాత్ర ఎక్కువ దూరం ఆటో నడపలేకపోయాడు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆలోచించాడు. ఎలక్ట్రిక్ ఆటో-రిక్షాను సోలార్-పవర్ వాహనం (solar-powered vehicle) గా మార్చమని శ్రీకాంత్ కుమార్తె సలహా ఇచ్చింది. Youtube చూసిన తర్వాత ఆమె ఈ విషయం చెప్పింది. ఎలక్ట్రిక్ ఆటో-రిక్షాను సౌరశక్తితో నడిచే వాహనంగా మార్చే ఆమె ఆలోచన గొప్పగా పనిచేస్తుందని భావించాడు. వెంటనే ఆటో టాప్ పై సోలార్ ప్యానల్ అమర్చి దానిని బ్యాటరీకి కనెక్ట్ చేశాడు. ఇప్పుడు, ఇంధనాన్ని నింపడం, లో బ్యాటరీ సమస్య లేదా ఛార్జింగ్ పెట్టాల్సిన ఇబ్బందులు దూరమయ్యయి. ఇప్పుడు ఈ ఆటో రిక్షా కాలుష్య రహితమైనది. మన వాతావరణాన్ని పచ్చగా, పరిశుభ్రంగా ఉంచుతుంది, ”అని శ్రీకాంత్ చెప్పారు.

“కొత్త సౌరశక్తితో నడిచే ఆటో రిక్షా పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 140 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఈ సోలార్ ఆటో-రిక్షా ప్రయాణికులకు చాలా సాఫీగా ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రస్తుతం రోజుకు రూ. 1300-1500 సంపాదిస్తున్నాను.. రాష్ట్ర రాజధానిలో సంతోషకరమైన కుటుంబాన్ని నడుపుతున్నాను, ”అని పాత్ర పేర్కొన్నాడు.
ఆర్థిక సమస్యల కారణంగా, అతడు VIII తరగతి తర్వాత తన చదువును మానేశాడు. నయాగఢ్ జిల్లాకు చెందిన ఆయన కొన్నేళ్లుగా భువనేశ్వర్‌లో ఉంటున్నారు..

electric auto into solar powered vehicle


Electric Vehicles కి సంబంధించిన అప్ డేట్స్ కోసం హరితమిత్ర పోర్టల్, తాజా వార్తల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి..

అలాగే ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..