కేంద్రం సబ్సిడీ తగ్గించినా అందుబాటు ధరలోనే..
ఇటీవల కేంద్రం ఎలక్ట్రిక్ స్కూటర్లపై సబ్సిడీ భారీగా తగ్గించింది. ఫలితంగా అన్ని ఈవీ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు దాదాపుగా రూ.1.40లక్షలకు పైగా ఉన్నాయి. అయితే ప్రముఖ ఈవీ కంపెనీ BattRE (బ్యాట్రే) తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను తగ్గించింది. BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ (Batt:RE) ఇ-మొబిలిటీ సంస్థ అర్బన్ వాహనదారుల కోసం క్యూట్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు కలిగిన పలు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ పోర్ట్ పోలియోలోని అత్యధిక ప్రజాదరణ పొందిన BattRE Storie Electric Scooter మోడల్ పై ఆఫర్ ను ప్రకటించడం విశేషం. ఈ ఆఫర్ 2023 జూలై 30 వరకు అందుబాటులో ఉంది.
BattRE Storie Electric Scooter స్పెసిఫికేషన్
ఈ స్కూటర్ దృఢమైన మెటల్ ప్యానెల్‌లతో రూపొందంచబడింది. 5-అంగుళాల బ్లూటూత్ TFT స్మార్ట్ స్క్రీన్‌తో వస్తుంది. ఇంటర్‌కనెక్ట్ చేసిన మోటార్, కంట్రోలర్, బ్యాటరీతో నియో సింక్‌ను కలిగి ఉంది. రైడర్‌లకు సమగ్రమైన, AI- సపోర్డ్ చేసే వివరాలు TFT స్క్రీన్ పై అందిస్తుంది. డిస్టెన్స్-టు-ఎంప్టీ, NAV అసిస్ట్, కాల్ నోటిఫికేషన్‌లు, టెలిమాటిక్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఈ స్కూటర్ మిడ్‌నైట్ బ్లాక్, స్టార్మీ గ్రే, ఎలక్ట్రిక్ బ్లూ రంగులతో పాటు బ్రాండ్-న్యూ రంగుల ఐస్ బ్లూ, స్టార్‌లైట్ బ్లూ, క్యాండీ రెడ్ మరియు ఎక్రూ ఎల్లోస్టోరీ రంగుల్లో అందుబాటులో ఉంది.
రేంజ్ : 132కిమీ/ఛార్జ్
గరిష్ట వేగం : 65 కి.మీ
ఛార్జింగ్ సమయం : 5 గంటల ఫుల్ ఛార్జింగ్
మోటార్ : 2kW IP 67 రేటెడ్ BLDC హబ్ మోటార్
ధర (ఎక్స్-షోరూమ్) : అంటే: ₹1,09,999.00
కలర్స్: ఐస్ బ్లూ, స్టార్‌లైట్ బ్లూ, కాండీ రెడ్, ఎక్రూ ఎల్లో, మిడ్‌నైట్ బ్లాక్, స్టార్మీ గ్రే మరియు ఎలక్ట్రిక్ బ్లూ
BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ గురించి
Batt:RE ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (Batt:RE) ఇ-మొబిలిటీ కంపెనీ 2017లో స్థాపించారు. కంపెనీ తన మొదటి స్కూటర్‌ను జూలై 2019లో విక్రయించింది. భారతదేశం అంతటా 21 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో 400 డీలర్‌షిప్‌ల నెట్‌వర్క్‌ను నిర్మించింది. ప్రారంభించిన మూడు సంవత్సరాలలోనే Batt:RE 30,000 యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను సాధించింది. ఈ క్రమంలో, కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటివరకు 4.8 లక్షల కిలోల CO2 ఉద్గారాలను తగ్గించడంలో దోహదపడ్డాయి. దీని ఫలితంగా నెలవారీ ఇంధన ఖర్చుల్లోనే రూ. 3.6 కోట్లు ఆదా అయిందని గణంకాలు చెబుతున్నాయి. కాగా Batt:RE రాబోయే మోటార్‌సైకిల్ కోసం 13 పేటెంట్లను దాఖలు చేసింది.
Looking for 2 vehicles