2023 నాటికి EVRE, Park+ ఆధ్వర్యంలో ఏర్పాటు
EV charging stations : ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారతదేశ వ్యాప్తంగా సుమారు 10వేలకు పైగా ఈవీ చార్జింగ్ EV charging stations ను ఏర్పాటు కానున్నాయి.
2023 చివరి నాటికి EVRE, Park+ సంస్థలు సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేస్తోంది. EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన EVRE అలాగే పార్కింగ్ సొల్యూషన్స్ బ్రాండ్ అయిన ర్కింగ్+ రెండేళ్లలో 10,000 EV ఛార్జింగ్ స్టేషన్లను భారతదేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. ఇందు కోసం రెండు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. లాజిస్టిక్స్, వ్యక్తుల మొబిలిటీ విభాగాల కోసం స్మార్ట్ ఛార్జింగ్, పార్కింగ్ హబ్‌లను ఏర్పాటు చేయడానికి స్థలాలను సేకరించడంలో ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేయనున్నాయి.
EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాల రూపకల్పన, తయారీ, స్థాపన, నిర్వహణను EVRE చూసుకుంటుంది. చార్జింగ్ హబ్ రియల్ ఎస్టేట్ వ్యవహారాన్ని పార్క్+ చూసుకుంటుంది. పార్క్+ ఇప్పటికే 1000+ అపార్ట్‌మెంట్‌లు, 250+ కార్పొరేట్ సంస్థలు 30+ మాల్స్‌కు విస్తరించింది.
ఈవీ చార్జింగ్ స్టేషన్లు అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలైన షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లు, మాల్‌లు, హోటళ్లు, EV ఛార్జర్‌ల అధిక వినియోగంలో సహాయపడే కార్పొరేట్ టెక్ పార్క్‌ల్లో ఏర్పాటు చేయబడతాయి.
దశల వారీ అమలులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీలో 300, బెంగళూరులో 100, ముంబై/ పూణేలో 100 EV charging stations హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు.
పార్క్+ వ్యవస్థాపకుడు మరియు CEO అమిత్ లఖోటియా మాట్లాడుతూ.. EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సరైన ప్రదేశాలను ఎంచుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. డిమాండ్ ఉన్న చోటే వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
One Reply to “దేశవ్యాప్తంగా 10000 EV charging stations”