Home » Evtric Ride HS, Mighty Pro EV launched
EV India Expo 2022

Evtric Ride HS, Mighty Pro EV launched

Spread the love

EV India Expo 2022 లో ఆవిష్క‌ర‌ణ‌

గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో జరుగుతున్న EV India Expo 2022 (EV ఇండియా ఎక్స్‌పో 2022) లో పూణేకు చెందిన Evtric Motors రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. కంపెనీ భారతదేశంలో Evtric రైడ్ హెచ్ఎస్, Mighty Pro electric scooters ( మైటీ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల )ను పరిచయం చేసింది. అదే వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 81,838 అలాగే రూ. 79,567 నుంచి ప్రారంభమవుతాయి. ఈ Evtric ఇ-స్కూటర్‌ల బుకింగ్‌లు ఇప్పుడు ప్రారంభ‌మ‌య్యాయి.

EV ఇండియా ఎక్స్‌పో 2022
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి గానీ లేదా సమీప Evtric డీలర్‌షిప్‌లో గానీ బుక్ చేసుకోవచ్చు. కొత్త Evtric రైడ్ HS, మైటీ ప్రో స్కూట‌ర్లు డిటాచ‌బుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంటాయి. అవి వరుసగా 55 kmph, 65 kmph వేగంతో ప్ర‌యాణిస్తాయి. అంతేకాకుండా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒకే ఛార్జ్‌పై 120 కిమీల రేంజ్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది.

Evtric రైడ్ HS రెడ్, బ్లాక్, వైట్, గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. అయితే మైటీ ప్రో రెడ్, వైట్, గ్రే రంగుల్లో ల‌భ్య‌మ‌వుతుంది. అవి నాలుగు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతాయ‌ని కంపెనీ తెలిపింది. Evtric మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలో ఎనిమిది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కలిగి ఉంది. కంపెనీ భారతదేశంలో 200 డీలర్‌షిప్‌ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 500 అవుట్‌లెట్‌లను పెంచాలని యోచిస్తోంది.

ఈ కొత్త electric scooters లాంచ్‌పై EVTRIC మోటార్స్ వ్యవస్థాపకుడు & MD మనోజ్ పాటిల్ మాట్లాడుతూ “భారతదేశం చాలా కాలంగా ఎదురుచూస్తున్న EV విప్లవాన్ని చూసే దిశగా క్రమంగా కదులుతోందని తెలిపారు. తాము ఆటోమేషన్ రంగంలో అవగాహన, అనుభవాన్ని కలిగి ఉన్నామని, భారతీయ ప్రేక్షకులకు నాణ్యమైన EV ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు.
“ఈ EV ఎక్స్‌పోలో మేము రెండు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నాము. మా పోర్ట్‌ఫోలియోలోని కొత్త స్టడ్‌లను చూసేందుకు ఔత్సాహికులు, ఇండస్ట్రీ వ‌ర్గాలతో పాటు, EV ఎక్స్‌పో ఇండియా ఇదే విషయాన్ని ప్రకటించడానికి సరైన వేదికగా భావిస్తున్న‌ట్ల తెలిపారు.

Tech News In Telugu

One thought on “Evtric Ride HS, Mighty Pro EV launched

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..