EV స్టార్టప్ EVTRIC మోటార్స్ దేశవ్యాప్తంగా తన పరిధిని వేగంగా విస్తరిస్తోంది. గత ఆరు నెలల్లోనే ఈ కంపెనీ భారతదేశ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. 2022 చివరి నాటికి తమ EVTRIC-dealership నెట్‌వర్క్‌ను 110 నుండి 350కి విస్తరించాలని భావిస్తోంది. ఫేజ్ IIలో తూర్పు, దక్షిణ భారత రాష్ట్రాల్లో మరింత విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.
రెండు రాష్ట్రాల్లో విరివిగా అమ్మకాలు..
ప్రస్తుతం తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి ప్రధాన రాష్ట్రాల్లో EVTRIC స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో EVTRIC మోటార్స్ కోసం అత్యధిక సంఖ్యలో అమ్మకాలు నమోదయ్యాయి. అవి దేశంలోని సహా టైర్ II, టైర్ III నగరాల్లో EVTRIC-dealership కలిగి ఉంది.
EVTRIC మోటార్స్ వ్యవస్థాపకుడు, MD మనోజ్ పాటిల్ మాట్లాడుతూ.. “COVID-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ ఆటోమోటివ్ పరిశ్రమకు బ్రేక్ వేసినప్పటికీ తమ బ్రాండ్, ఉద్యోగుల హృదయపూర్వక కృషితో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో నెమ్మదిగా బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పరుచుకుందని తెలిపారు.
కంపెనీ తమ ప్రయాణాన్ని రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో ప్రారంభించింది. అవి యాక్సిస్, రైడ్( Axis, Ride) రైడ్ మోడల్ ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడవుతుతోంది. ఈ Ride Electric Scooter గరిష్టంగా 25kmph వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కో ఛార్జీకి 75km రేంజ్‌ను అందిస్తుంది. కస్టమర్ల వివిధ అవసరాలు తీర్చేందుకు EVTRIC కంపెనీ త్వరలో ఏడు వేర్వేరు Electric Vehicles ను తీసుకుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. EV ఇండియన్ ఎక్స్‌పోలో, EVTRIC మూడు కొత్త మోడళ్లను ప్రదర్శించింది. స్లో స్పీడ్, అలాగే హై-స్పీడ్ స్కూటర్‌లు రెండూ కూడా 100kmph గరిష్ట వేగాన్ని అందుకోగల ఎలక్ట్రిక్ వాహనాలు ఈ కంపెనీ చార్ట్‌లో ఉన్నాయి. EVTRIC స్కూటర్లు iCATచే ఆమోదించబడ్డాయి. భారతదేశంలోనే తయారు చేయబడ్డాయి. ఈవీట్రిక్ కంపెనీ 100 శాతం ఇండియాలోనే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే ఆలోచనలో ఉన్నారు.
Nice