, సరుకుల రవాణాకు అనుకూలం
సింగిల్ చార్జిపై 110కి.మి రేంజ్
EVTRIC మోటార్స్ సంస్థ మరో ఎలక్ట్రిక్ వెహికల్‌ను విడుదల చేసింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇటీవల జరిగిన EV ఎక్స్‌పో 2021 లో తన B2B E- డెలివరీ స్కూటర్‌ను ప్రదర్శించింది. ఈ స్కూటర్ సరుకుల డెలివరీ కోసం ఉద్దేశించింది. ఇందులో సరుకులను ఉంచేందుకు అదనపు క్యారియర్లతో వస్తుంది. ఇది లోస్పీ్ వెహికిల్ గంటకు 25 కిమీ వేగంతో వెళ్తుంది. ఈ స్కూటర్ స్థానిక వ్యాపారాల డెలివరీలకు చక్కగా సరిపోతుంది. ఇందులో 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. 150 కిలోల లోడింగ్ సామర్థ్యం కలిగి ఉండడం దీని ప్రత్యేకత.
ఈ స్కూటర్లోని లిథియం-అయాన్ బ్యాటరీని ఛార్జ్ కావడానికి సుమారు మూడున్నర గంటలు పడుతుంది. ఇది డిటాచబుల్ బ్యాటరీ. స్కూటర్ నుంచి విడదీసి చార్జ్ పెట్టుకోవచ్చు. ఒక్కసారి చార్జి చేస్తే 110 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. EV ఎక్స్‌పో 2021 లో EVTRIC మోటార్స్ ఉత్పత్తులను ప్రదర్శించింది. అయితే ఈవీట్రిక్ కంపపెనీ ఇటీవల EVTRIC యాక్సిస్ మరియు EVTRIC రైడ్ అనే మోడళ్లను కూడా ఆవిష్కరించింది.
EVTRIC బ్రాండ్ ఇప్పటికే ఆన్‌బోర్డింగ్ డీలర్లను ప్రారంభించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర,
గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఢిల్లీ , ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌లో తన డీలర్‌షిప్‌లను కలిగి ఉంది.
మరో వైపు యులు-ఇ-మొబిలిటీ అనే సంస్థ కూడా ఆగస్టు 2021లో డిక్స్ అనే పేరుతో ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. ఇది ఆహారం, కిరాణ సామగ్రి మరియు ఔషధాలను డెలివరీ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్ 2021 నాటికి మొదటి దశలో బెంగళూరు, ముంబై మరియు ఢిల్లీ అంతటా 10,000 యులు డిఎక్స్ స్కూటర్‌ను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది.
గతంలో ఒకినావా సంస్థ కూడా ఒకినావా డ్యూయల్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ మోపెడ్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇది గంటకు 25కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సింగిల్ చార్జిపై 120కిలోమీటర్లు వెళ్లవచ్చు. దీని బ్యాటరీని చార్జ్ చేయడానికి సుమారు 3గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్‌పై 200కిలోల బరువు గల సరుకులను సులభంగా రవాణా చేయవచ్చు.
I like it very much. How much is it cost