Wednesday, November 6Lend a hand to save the Planet
Shadow

Skellig Lite e-cycle విడుద‌ల‌

Spread the love
 Skellig Lite e-cycle
Skellig Lite e-cycle

GoZero కంపెనీ ఇండియాలో ఓ ఎల‌క్ట్రిక్ సైకిల్‌ను లాంఛ్ చేసింది. Skellig Lite e-cycle పేరుతో విడుద‌ల చేసిన ఈ సైకిల్ ధ‌ర రూ.19,999 వద్ద ప్రారంభ‌మ‌వుతుంది. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ధ‌ర‌లో ల‌భించే ఎల‌క్ట్రిక్ సైకిల్‌గా నిలిచిందని చెప్ప‌వ‌చ్చు.

Skellig Lite e-cycle స్పెసిఫికేష‌న్స్‌

గోజీరో సైకిల్ 25 కి.మీ రేంజిని క‌లిగి ఉంటుంది. గంట‌కు గరిష్టంగా 25 kmph వేగంతో ప్ర‌యాణిస్తుంది. Skellig Lite e-cycle లో డిటాచ‌బుల్ ఎనర్‌డ్రైవ్ 210 Wh లిథియం బ్యాటరీ ప్యాక్ ను వినియోగించారు. ఇక వెనుక చ‌క్రానికి 250 W వెనుక హబ్-డ్రైవ్ మోటార్‌తో ఇది శ‌క్తిని పొందుతుంది. GoZero డ్రైవ్ కంట్రోల్ 2.0 LED డిస్‌ప్లే యూనిట్ ద్వారా నియంత్రించబడుతుంది. ఇందులో మూడు పెడల్-అసిస్ట్ మోడ్‌లను ఎంచుకునే ఆప్ష‌న్లు ఉన్నాయి. ఇందులోని బ్యాటరీ రీఛార్జ్ చేయడానికి కేవలం 2.5 గంటలే పడుతుంది. లైట్‌లో 26 × 1.95 టైర్లు, ప్రత్యేకమైన V- బ్రేక్‌లు మరియు దృఢమైన ఫ్రంట్ ఫోర్క్‌తో కూడిన అల్లాయ్ స్టెమ్ హ్యాండిల్ ఉంటుంది.

ఈవీల‌కు పెరిగిన ఆద‌ర‌ణ‌

కోవిడ్ కారణంగా చాలా మ‌ది ప్రజా రవాణాపై అంత‌గా మొగ్గు చూప‌డం లేదు. సామాజిక దూరం పాటించేందుకు గాను ప్రపంచవ్యాప్తంగా అంద‌రూ ఎల‌క్ట్రిక్ సైకిళ్లు, వాహ‌నాల‌ను కొనుగోలు చేస్తున్నారు. ఫ‌లితంగా ఈవీల అమ్మ‌కాలు గత ఏడాది కాలంలో పెరిగాయి. స్కెల్లిగ్ లైట్ ప్రారంభంతో గోజీరో తన ప్రచారంలో మొదటి అడుగు వేసింది. కాలుష్య నివార‌ణ‌కు ఈ-సైకిళ్లు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని, అలాగే పెడ‌ల్ అసిస్టెంట్‌తో శారీర‌క దారుఢ్యం కూడా పెరుగుతుంద‌ని ముమ్మ‌రంగా ప్ర‌చారం చేస్తోంది.

e-cycle పై గోజెరో సీఈవో అంకిత్ కుమార్ మాట్లాడుతూ.. క‌రోనా మహమ్మారి ప్రారంభం నుంచి అలాగే సెకండ్ వేవ్ వ‌ర‌కు ప్ర‌జ‌లు అనేక అవ‌స్థ‌లు ప‌డ్డార‌ని తెలిపారు. వారి స్వంత ఆరోగ్యంపై గ‌తంలో కంటే ఇప్పుడు మ‌రింత శ్ర‌ద్ధ తీసుకుంటున్నార‌ని తెలిపారు. రోజువారీ ఫిట్‌నెస్ పెంచుకునేందుకు స్కెల్లిగ్ లైట్ సైకిల్‌నుసైకిల్‌ను తీసుకొచ్చామ‌ని పేర్కొన్నారు. స్కెల్లిగ్ సైకిళ్ల‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. స్కెల్లిగ్, స్కెల్లిగ్ లైట్ మరియు స్కెల్లిగ్ ప్రో. ఈ మూడు వేరియంట్‌లు భారతీయ మార్కెట్‌లో మంచి ఆదరణ పొందాయ‌ని తెలిపారు.

ఇప్ప‌టికే హీరో ఎల‌క్ట్రిక్‌, ప్యూర్ ఈవీ కంపెనీల‌కు చెందిన ఎల‌క్ట్రిక్ సైకిళ్లు మార్కెట్‌లో మంచి గుర్తింపు పొందాయి.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *