Flipkart year-end sale : బజాజ్ చేతక్ 3202ని రూ. 1.04 లక్షలకు ఎలా కొనుగోలు చేయాలి?

Flipkart year-end sale : బజాజ్ చేతక్ 3202ని రూ. 1.04 లక్షలకు ఎలా కొనుగోలు చేయాలి?

Flipkart year-end sale | 2024 సవంత్సరానికి బైబై చెప్పడానికి ఇంకా కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనాలని చూస్తున్నట్లయితే, భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఈ-స్కూటర్‌లలో ఒకటైన బజాజ్ చేతక్ 3202 (Bajaj Chetak 3202) పై అద్భుతమైన డీల్‌ సొంతంచేసుకునేందుకు ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండింగ్ సేల్ సందర్భంగా బాజాజ్ చేతక్ పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్ లో భాగంగా రూ. 10,000 కంటే ఎక్కువ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ డీల్ వెనుక ఉన్న అంశాలను ఇక్కడ తెలుసుకోండి..

బజాజ్ చేతక్ 3202: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ఏమిటి?

Flipkart year-end sale బజాజ్ చేతక్ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ MRP ధర రూ. 1,15,018 కాగా, కానీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న అన్ని డీల్‌లతో ఇది కేవలం రూ. 1,04,517 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువగా ఫ్లాట్ రూ.5,000 తగ్గింపును అందిస్తోంది. దీనితో పాటు, రూ. 6,000 వరకు విలువైన ప్రముఖ బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డ్‌లపై కూడా ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఫ్లెక్సిబుల్ EMI ఎంపికలను కూడా అందిస్తోంది.

బజాజ్ చేతక్ 3202: స్పెక్స్

Bajaj Chetak 3202 Specs : బజాజ్ చేతక్ 3202 3.2 kWh బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఇది స్టాండర్డ్, టెక్‌పాక్ అనే రెండు ట్రిమ్‌లలో లభిస్తుంది. స్టాండర్డ్, టెక్‌పాక్ వేరియంట్లు సింగిల్ చార్జిపై 137 కి.మీ రేంజ్ అందిస్తాయి. మొదటిది 63 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఇక రెండవది 73 కి.మీ వేగంతో వెళ్తుంది. రైడ్ మోడ్‌ల పరంగా, స్టాండర్డ్ ఎకో మోడ్ మాత్రమే ఉంటుంది. ఇందులో LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. అయితే Tecpac హిల్ హోల్డ్, ఎకో, స్పోర్ట్స్‌ రివర్స్ మోడ్ లను, TFT డిజిటల్ కన్సోల్ వంటి అదనపు ఫీచర్లతో కలిగి ఉంది. Tecpacతో కూడిన చేతక్ 3202 ధర అదనంగా రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుంది. చేతక్ 3202 సమయం 0 నుండి 80 శాతం వరకు చార్జ్ కావడానికి 3 గంటల 35 నిమిషాల సమయం తీసుకుంటుంది.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు