Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

పచ్చదనానికి చిరునామా దేవాలయాలు..

Spread the love

ఆలయాలను హరితవనాలుగా తీర్చిదిద్దేందుకు కేరళ ప్రభుత్వం నిర్ణయం

తిరువనంతపురం: కేరళలో వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడానికి, CPI(M) నేతృత్వంలోని ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న ఐదు Devaswom Boards నిర్వహిస్తున్న 3,000 దేవాలయాలలో మొక్కల పెంపకానికి ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అంతేకాకుండా, రాష్ట్రంలోని పాడుబడిన ఆలయ చెరువులను పునరుద్ధరించడం, తోటలను రక్షించడం ద్వారా నీటి వనరులను సంరక్షించడం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంది. green cover in temples

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడి ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డు (టీడీబీ) ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో రాష్ట్ర దేవస్వామ్‌ మంత్రి కే రాధాకృష్ణన్‌ మొక్కలు నాటడం ద్వారా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్రంలోని అన్ని దేవస్వం బోర్డులకు సర్క్యులేట్ చేశామని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె.అనంతగోపాలన్ తెలిపారు.

‘కేరళలోని దేవస్వోమ్ బోర్డులకు మంచి ల్యాండ్ బ్యాంకులు ఉన్న అనేక దేవాలయాలు ఉన్నాయి. కాబట్టి, ఈ భూముల్లో చెట్లను పెంచాలనేది మా ఆలోచన, తద్వారా మేము ఆకుపచ్చని హరితవనాన్ని మెరుగుపరచగలము’ అని అనంతగోపాలన్ PTI కి చెప్పారు.
దేవాలయాల కాంపౌండ్‌లలో వివిధ రకాల పూల మొక్కలు, ఫలాలను ఇచ్చే చెట్లను కూడా నాటుతామని, తద్వారా ఆలయంలో రోజువారీ ఉపయోగం కోసం పువ్వులు, పండ్లను కూడా ఉత్పత్తి చేయవచ్చని, ఈ ఆలయాలు స్వావలంబనగా ఉండటానికి సహాయపడతాయని ఆయన చెప్పారు.

తిరువనంతపురం జిల్లాల నుండి ఎర్నాకులం వరకు అనేక దేవాలయాలను నిర్వహించే TDB, శిథిలావస్థలో ఉన్న ఆలయ చెరువులకు సంబంధించిన డేటాను సేకరించాలని తన అసిస్టెంట్ కమిషనర్లందరినీ ఆదేశించింది. దేవాలయాల చెరువులు వివిధ ప్రాంతాలకు ప్రధాన నీటి వనరు. కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో ఈ చెరువులను పునరుద్ధరించి సంరక్షిస్తామని అనంతగోపాల్ తెలిపారు.

ఇప్పటికే చాలా పెద్ద పవిత్రమైన తోటలు పరిరక్షించామని, ఇతర దేవాలయాలు కూడా తమ సొంత గ్రీన్ కవర్‌ను పెంచుకున్న తర్వాత, మేము హరితవనాలను గణనీయంగా మెరుగుపరచగలమని దేవస్వోమ్ బోర్డు ప్రెసిడెంట్ చెప్పారు.

పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర చిహ్నాలుగా ఆలయాలను రూపొందించాలనే ఆలోచనతో పాటు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డుతో పాటు కొచ్చి, మలబార్, గురువాయూర్, కూడల్మాణికం దేవస్వం బోర్డులు కూడా తమ దేవాలయాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.

కేరళ ప్రభుత్వం ఇప్పటికే ‘కవుమ్ కులవుమ్’ (పవిత్ర తోటలు- చెరువులు) అనే ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది. ఇక్కడ ప్రభుత్వం వారి ప్రైవేట్ ఆస్తులపై.. అంటే తోటలు చెరువులను రక్షించడానికి గ్రాంట్‌ను అందిస్తోంది.

దేవాలయాలు ఎల్లప్పుడూ పర్యావరణ అనుకూలమైనవి, పూజలు, ఇతర ఆచారాల కోసం ప్రకృతి నుండి సేకరించిన సేంద్రీయ పదార్థాలను మాత్రమే ఉపయోగిస్తాయి. కాబట్టి ఈ ఆలయాలను పర్యావరణ పరిరక్షణకు చిహ్నాలుగా మార్చడం తమ లక్ష్యమని అనంతగోపాల్ అన్నారు.


Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *