ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం Harley-Davidson ఈ సంవత్సరం తరువాత రెట్రో- ఇన్‌స్పైర్డ్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
హార్లే-డేవిడ్సన్ నుంచి రాబోతున్న మొదటి ఎలక్ట్రిక్ సైకిల్ .. S1(సీరియల్ 1) మోష్/ట్రిబ్యూట్ ఇ-సైకిల్. ఇప్పుడు పరిమిత సంఖ్యలో ఈ సైకిళ్లను విక్రయిస్తుంది. సీరియల్ 1 గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభించబడింది. ఇది పాత తరం సైకిల్ లా కనిపించేలా ఈ ప్రోటోటైప్ ఇ-సైకిల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. సీరియల్-1 సుమారు 650 వ్యక్తిగత యూనిట్లను ఉత్పత్తి చేస్తుందని ఒక నివేదిక పేర్కొంది.
650 యూనిట్లు యుఎస్ అలాగే యూరోపియన్ మార్కెట్లలో పంపిణీ చేయబడతాయి. ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ సైకిళ్ల ధరను ఇంకా వెల్లడించలేదు. భవిష్యత్తులో మరింత ప్రత్యేకమైన అత్యంత సౌకర్యవంతమైన సీరియల్ 1 ఇ-బైక్ మోడళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది.
100 సంవత్సరాల క్రితం నుంచి Harley-Davidson రూపొందించిన మొట్టమొదటి మోటార్‌సైకిల్ నుండి స్ఫూర్తిగా తీసుకొని
సీరియల్ 1 ఎలక్ట్రిక్ సైకిల్‌ను తీసుకొచ్చారు. 2020 ప్రోటోటైప్ లేదా ట్రిబ్యూట్ ఇ-బైక్ లెదర్ జీను, తెల్లటి టైర్లు, నిగనిగలాడే పెయింట్‌లతో ఆకర్షనీయంగా కనిపిస్తోంది.
ఈ సంవత్సరం S1 మోష్/ట్రిబ్యూట్ యొక్క పరిమిత ఎడిషన్‌తో, సీరియల్ 1 పాతకాలపు బైక్ యొక్క ఆకర్షణను తిరిగి తీసుకొచ్చింది..
ఇందులో హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులు, మిడ్ డ్రైవ్ మోటార్, కార్బన్ బెల్ట్ డ్రైవ్, బైక్ యొక్క బ్రాండింగ్, ఇంటిగ్రేటెడ్ లైటింగ్ టెక్నాలజీని కలిగి ఉంది.
Super
Costly bike