Wednesday, November 6Lend a hand to save the Planet
Shadow

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో Hero Electric కొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు

Spread the love

Hero Electric Optima CX5.0, Optima CX2.0, NYX (డ్యూయల్ బ్యాటరీ) వాహ‌నాల ప్ర‌త్యేక‌త‌లు ఏమిటి?

దేశంలోని అతిపెద్ద ఈవీ సంస్థ Hero Electric కొత్త‌గా మూడు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను విడుద‌ల చేసింది. వీటి ధ‌ర‌లు రూ.85వేల నుంచి ప్రారంభ‌మ‌వుతాయి. Optima CX5.0 (డ్యూయల్ బ్యాటరీ), Optima CX2.0 (సింగిల్ బ్యాటరీ) NYX (డ్యూయల్ బ్యాటరీ) వేరియంట్ల‌ను ప్ర‌క‌టించింది. వేరియంట్ల‌ను బ‌ట్టి ధ‌ర‌లు 85,000, రూ. 95,000 నుండి రూ. 1.05 లక్షలు, 1.30 లక్షలుగా ఉంది. Hero Electric కొత్త వాహ‌నాలు బెస్ట్-ఇన్-క్లాస్ ఆప్టిమైజ్డ్ పవర్‌ట్రెయిన్, మెరుగైన భద్రతను కలిగి ఉన్నాయి.

Hero Electric Optima CX5.0 మాట్ బ్లూ షేడ్, మాట్ మెరూన్ షేడ్ రంగుల్లో అందుబాటులో ఉంది. Optima CX2.0 మ్యాట్ బ్లూ, బ్లాక్ కలర్ స్కీమ్‌ను క‌లిగి ఉంది. అలాగే NYX నలుపు, తెలుపు రంగులలో అందుబాటులో ఉంటుంది.

కొత్త మోడ‌ళ్ల ప్ర‌త్యేక‌త‌లేమిటీ?

కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌లు మెరుగైన సాంకేతికత‌, సామర్థ్యాలను పెంచుకొని మార్కెట్‌లోకి వ‌చ్చాయి. టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్‌లు ఎక్కువ మైలేజీని అందించడానికి హైబర్నేటింగ్ బ్యాటరీ సాంకేతికతను క‌లిగి ఉన్నాయి. అలాగే రిమోట్ మెయింటెనెన్స్‌తో సహా బిల్ట్-ఇన్ సాఫ్ట్‌వేర్ ద్వారా వెహికల్ డయాగ్నస్టిక్‌లను మెరుగుపరచడానికి ఉద్దేశించిన సింక్రొనైజ్ చేయబడిన పవర్‌ట్రెయిన్‌ను అందించారు. బ్యాటరీ లైఫ్ ప్రొటెక్ష‌న్‌ను పెంచారు. మ‌రోవైపు
కంపెనీ 5 లక్షల యూనిట్ల (అర మిలియన్) తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొంది. 20 లక్షల యూనిట్ల (2 మిలియన్లు) వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రాజస్థాన్‌లో గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

Hero Electric Optima CX5.0, NYX స్పెసిఫికేష‌న్స్‌

Optima CX2.0 వేరియంట్ 1.9kW మోటారు క‌లిగి, 2kWh బ్యాటరీ ప్యాక్‌తో వ‌స్తుంది. సింగిల్ ఛార్జ్‌కి 89km రేంజ్‌, గంట‌కు 48km గరిష్ట వేగంతో ప్ర‌యాణిస్తుంది. Optima CX5.0 మోడ‌ల్ ఆధునిక టెక్నాల‌జీ, మ‌రిన్ని ఫీచ‌ర్స్ క‌లిగి ఉంటుంది. మెరుగైన పనితీరు క‌న‌బరుస్తుంది. ఇది 3kWh బ్యాటరీ ప్యాక్‌, 1.9kW మోటార్‌తో అమర్చబడి ఉంది. సింగిల్ చార్జిపై 113km రేంజ్‌, గంట‌కు 48km గరిష్ట వేగం దీని సొంతం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు పనితీరు స్థిరత్వానికి విలువనిచ్చే వారికి సరైన ఎంపిక.
ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న హీరో ఎలక్ట్రిక్‌.. Optima CX2.0, NYX CX5.0 మోడ‌ళ్ల‌తో ఉజ్వలమైన స్థిరమైన భవిష్యత్తుకు ఢోకా ఉండ‌బోదు. మూడు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లు ధరలు రూ. 85,000 నుండి రూ. 1.3 లక్షల వరకు ఉన్నాయి.

కొత్త వాహ‌నాల ఆవిష్క‌ర‌ణ‌పై హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ త‌మ 6 లక్షల బైక్‌ల వినియోగ‌దారుల నుండి 15 సంవత్సరాలలో వచ్చిన విస్తృతమైన ఫీడ్‌బ్యాక్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఈ కొత్త శ్రేణి పవర్ ట్రైన్‌లను రూపొందించామ‌ని తెలిపారు. త‌మ బైక్‌ల డిజైన్‌పై ఉన్న ప్రజాదరణను దృష్టిలో పెట్టుకొని చాలావరకు అదే డిజై్‌ను కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు.

 

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *