Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Hero MotoCorp Electric Scooters వ‌స్తున్నాయ్‌..

Spread the love

Hero Ev బ్రాండ్ Vida లోగో ఆవిష్క‌ర‌ణ‌

భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన త‌యారీ సంస్థ Hero MotoCorp తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్త బ్రాండ్‌ను విడుదల చేసింది. హీరో బ్రాండ్ పేరుపై Hero Electric (హీరో ఎలక్ట్రిక్‌ )తో కొనసాగుతున్నవివాదం కారణంగా ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా హీరో మోటో కార్ప్ కంపెనీ తన EV వ్యాపారం కోసం ఒక ప్రత్యేక బ్రాండ్‌ను ప్రారంభించి జాగ్రత్తగా అడుగు వేయవలసి వచ్చింది.
హీరో తన మొదటి ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్‌ను జూలై 1న విడుదల చేయనుంది.
MotoCorp దాని రాబోయే Hero MotoCorp Electric Scooters ఉత్పత్తుల కోసం విడా ( Vida ) అనే బ్రాండ్‌ను ఉపయోగించుకుంటోంది. కంపెనీ తన EVల కోసం Vida, Vida MotoCorp, Vida EV, Vida Electric, Vida Scooters. Vida మోటార్‌సైకిల్స్ వంటి అనేక పేర్లకు పేటెంట్‌ను దాఖలు చేసింది.
అదే సమయంలో హీరో మోటోకార్ప్, $100 మిలియన్ల స్లోబల్ సస్టైనబిలిటీ ఫండ్‌ను కూడా ప్రకటించింది. ESG సొల్యూషన్స్‌పై 10,000 కంటే ఎక్కువ మంది వ్యవస్థాపకులను ప్రోత్సహించే లక్ష్యంతో BML ముంజాల్ విశ్వవిద్యాలయం (BMU), హీరో మోటోకార్ప్ నేతృత్వంలోని ప్రపంచ భాగస్వామ్యాలను స్థాపించడం ఈ ఫండ్ లక్ష్యం.

ప‌లు సంస్థ‌ల‌తో ఒప్పందాలు

Hero MotoCorp Electric Scooters త‌న EV వ్యాపారానికి అనుగుణంగా ప‌లు కంపెనీలతో టై-అప్‌లు, భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. ఇది ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఏథర్ ఎన‌ర్జీ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో జతకట్టింది. ఈ కంపెనీలో హీరోకి దాదాపు 38 శాతం వాటా ఉంది. ఛార్జింగ్ ఇన్‌ఫ్రా, గ్లోబల్ బిజినెస్ లేదా ఫ్రంట్ ఎండ్‌ను అభివృద్ధి చేయడంలో రెండు కంపెనీలు సినర్జీలను అన్వేషిస్తున్నాయని తెలుస్తోంది.

అదేవిధంగా హీరోమోటో కార్ప్ తైవాన్ ఆధారిత గొగోరోతో జాయింట్ వెంచర్‌ను కూడా ఏర్పాటు చేసింది. దీనిలో బ్యాటరీ మార్పిడి ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయడానికి $285 మిలియన్లను పెట్టుబ‌డి పెట్టింది. “మేము ఉత్పత్తి లేదా రాబడి కంటే పర్యావరణ వ్యవస్థ ప‌రిర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని, ఇందుకోసం అనేక టై-అప్‌లను ఏర్పరుచుకుంటున్నామని కంపెనీ చెబుతోంది.

Bajaj, TVS నుంచి పోటీ

బ్రోకరేజ్ సంస్థ UBS సెక్యూరిటీస్ ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఆటోమొబైల్ రంగంలో హీరో మోటో కార్ప్ దాని ప్ర‌త్య‌ర్థులైన Bajaj Auto, TVS Motors వంటి బ‌డా సంస్థలు ఇప్ప‌టికే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. ఈ క్ర‌మంలో ఈ కంపెనీలు పెట్రోల్ వాహ‌నాల నుంచి ఎలక్ట్రిక్‌కు క్రమంగా మారడం వల్ల హీరో కంపెనీకి అత్యంత సంక్లిష్ట ప‌రిస్థితులు ఎదురుకానున్నాయి.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *