Hero MotoCorp : కొద్ది రోజుల క్రితమే, హీరో మోటోకార్ప్ తమ మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని 2022 మార్చి నాటికి మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. అయితే హీరో మోటోకార్ప్ తయారు చేసే ఎలక్ట్రిక్ వాహనాలు ఏ బ్రాండ్ పేరుతో ఉండబోతున్నాయనే విషయంలో కొత్తపేరు వినిపిస్తోంది. ప్రభుత్వ అధికారిక ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ లో ‘విడా’ పేరుతో మల్టీ ట్రేడ్‌మార్క్‌లను హీరో మోటోకార్ప్ దాఖలు చేసిందని తెలిసింది. దేశంలోని ఏస్ ద్విచక్ర వాహన దిగ్గజం విడా ఎలక్ట్రిక్.. విడా మొబిలిటీ, విడా EV, విడా మోటోకార్ప్, విడా స్కూటర్లు, విడా మోటార్‌సైకిల్స్ వంటి పేర్ల కోసం ట్రేడ్‌మార్క్‌లను దాఖలు చేసింది.
దీనిని బట్టి హీరో మోటో కార్ప్ కంపెనీ యొక్క రాబోయే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు Vida చాలావరకు బాధ్యత వహించే బ్రాండ్‌గా ఉండనుంది. హీరో MotoCorp, Hero Electric మధ్య ఉన్న అవగాహనను దృష్టిలో ఉంచుకుని ఈ విడా బ్రాండ్‌తో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. దీని ప్రకారం. ‘హీరో’ పేరుతో ఎటువంటి ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించలేరు. కొన్ని నెలల క్రితం, హీరో మోటోకార్ప్ బ్యాటరీ స్వాపింగ్ సాంకేతికత కోసం తైవాన్-ఆధారిత బ్రాండ్ గొగోరోతో ఒప్పందంపై సంతకం చేసింది. దీనిని బట్టి , కంపెనీ యొక్క రాబోయే ఎలక్ట్రిక్ వాహనాలు చాలా వరకు డిటాచబుల్ బ్యాటరీలతో రావచ్చని తెలుస్తోంది.
హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆగమనం గురించి గత ఆగస్ట్‌లోనే పవన్ ముంజాల్ కాస్త క్లూ ఇచ్చారు. రాబోయే హీరో మోటో కార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఓలా S1 ప్రో, ఏథర్ 450X, బజాజ్ చేతక్, TVS iQube వంటి కొన్ని ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య పోటీగా నిలవనున్నట్లు ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు, కంపెనీ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్‌ల విషయానికి వస్తే హీరో మోటోకార్ప్ బ్రాండ్ యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన తర్వాత .. కొన్ని నెలల తర్వాత ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే జరిగితే, రాబోయే Hero MotoCorp ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లోని Revolt RV400 వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. మరిన్ని అప్‌డేట్‌ల కోసం హరిత మిత్ర వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి తాజా ఎలక్ట్రక్ వాహనాల కథనాల కోసం హరితమిత్ర YouTube ఛానెల్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
One thought on “Vida బ్రాండ్ కింద Hero MotoCorp ఎలక్ట్రిక్ వాహనాలు! ”