Hero Motocorp Surge S32 | మీరు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన డార్క్ నైట్ సినిమాను చూశారా.. అందులో బాట్‌మాన్ కారులో ఒక్క బటన్ నొక్కగానే అందులో నుంచి బైక్ ఒకటి బయటకు దూసుకువస్తుది. హాలివుడ్ సినిమాల్లోనే చూసిన ఈ అద్భుతమైన సన్నివేశం ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ సాధ్యమైంది. భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ, హీరో మోటోకార్ప్ యాజమాన్యంలోని సర్జ్ స్టార్టప్ కూడా సరిగ్గా ఇలాంటి ఆవిష్కరణ చేసింది. ఇది ఒక ప్రత్యేకమైన త్రీ-వీలర్ ఎలక్ట్రిక్ వాహనం.. కానీ కేవలం మూడు నిమిషాల్లోనే ఇది ఒక ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్కూటర్‌గా మారుతుంది. స్వయం ఉపాధి పొందే వ్యక్తుల కోసం ప్రత్యేకమైన త్రీ-వీలర్ కమ్ స్కూటర్ ను రూపొందించింది. ఒకే వాహనంలో ఎలక్ట్రిక్ రిక్షా తోపాటు ఎలక్ట్రిక్ స్కూటర్ రెండింటిని అవసరాన్ని బట్టి వినియోగించుకోవడం దీని ప్రత్యేకత.
భారత ఆటోమొబైల్ రంగంలో ఊహించని విధమైన సరికొత్త ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా Hero ఆధారిత స్టార్టప్ సర్జ్.. 2 ఇన్ 1 ఫీచర్లతో కూడిన Hero Surge S32 వాహనాన్ని రూపొందించింది. ఈ వాహనాన్ని స్కూటర్ గానూ అలాే కార్గో వాహనంగానూ ఉపయోగించవచ్చు.
భారత్‌లో మొదటి వాహనం ఇదే..!
భారతదేశంలో2 ఇన్ 1 ఫంక్షనాలిటీతో వస్తున్న తొలి వాహనం ఇదే. సర్జ్ S32 వాహనంలో (Hero Surge Convertible EV) కంపెనీ అనేక ప్రత్యేక ఫీచర్లను పొందుపరిచింది. ఇప్పటికే ఇలాంటి వాహనాలు విదేశాల్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. అయితే భారత్‌లో ఈ మోడల్ వాహనాలను తాజాగా ఆవిష్కరించారు. త్వరలోనే కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని సమాచారం.
మూడు నిమిషాల్లోనే త్రీవీలర్ నుంచి టూవీలర్ గా..
సర్జ్ స్టార్టప్ రూపొందించిన Surge S32 ఎలక్ట్రిక్ వాహనాన్ని అత్యంత సులువుగా స్కూటర్ గా లేదా త్రీవీలర్‌గా మార్చుకోవచ్చు. ఇందుకు కేవలం మూడు నిమిషాల సమయం మాత్రమే పడుతుందని సంస్థ చెబుతోంది. ఈ వాహనంతో ప్రీమియం ప్రయాణ అనుభూతిని ఆస్వాదించవచ్చు. అందుకోసం అనేక అత్యాధునిక ఫీచర్లను కల్పించింది.
సాఫ్ట్ సిటింగ్, అద్భుతమైన స్పెసిఫికేషన్లను అందించింది కంపెనీ… విండ్ స్క్రీన్, విండ్ స్క్రీన్ వైపర్‌ను కలిగి ఉంటుంది.. వానాకాలంలో సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు రెండు వైపులా డోర్లు కూడా అందించింది. ఇందులో రెండు మోటార్లు ఉంటాయి. ద్విచక్ర వాహనంలో 4bhp శక్తిని ఉత్పత్తి చేసే 3kW మోటార్‌ను అమర్చారు. అలాగే త్రీవీలర్ కోసం 10kW మోటార్‌ను ఉపయోగించింది. ఈ మోటార్ 13.4bhp శక్తిని జనరేట్ చేస్తుంది.
రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్ లు
Hero Motocorp Surge S32 లో రెండు వేర్వేరు సామర్థ్యాలు గల బ్యాటరీలను అమర్చారు. మొదట ద్విచక్ర వాహనం కోసం 3.5kWh బ్యాటరీ, రెండోది త్రీవీలర్ కోస 11kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. అయితే ఈ వాహనాన్ని కార్గో అవసరాల కోసం ఉపయోగించినప్పుడు 500 కిలోల వరకు బరువును తీసుకెళ్లగలదు. ఈ వాహనం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇందులో త్రీవీలర్ 50 km/h వేగంతో ప్రయాణిస్తుంది. ఇక స్కూటర్ 60 km/h వేగంతో కొంచెం వేగంగా ఉంటుంది.
మూడు వేరియంట్లు: సర్జ్ స్టార్టప్‌కు చెందిన S32 ఎలక్ట్రిక్ వాహనం లోడ్ ఆటో, ప్యాసింజర్ ఆటో, కేజ్డ్ వెహికల్ అనే వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. అయితే వాహనం ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది, దీని ధర తదితర విషయాలను సంస్థ ఇంకా వెల్లడించేదు. ఈ వివరాలు త్వరలోనే వెల్లడికానున్నట్లు తెలుస్తోంది.
#Hero has unveiled a revolutionary three-wheeler that transforms into a two-wheeler, showcasing the innovative spirit and ingenuity of Indian engineering. It’s amazing to witness such groundbreaking advancements. #Innovation #MakeInIndia 🇮🇳 🛵 pic.twitter.com/yHJPzys5kb
— Harsh Goenka (@hvgoenka) January 26, 2024
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..