Tilting Electric vehicle | విభిన్నమైన ట్రాఫిక్ కు పేరుగాంచిన ముంబై నగరంలో ఒక ప్రత్యేకమైన అధునాతనమైన మూడు-చక్రాల వాహనం నగర రోడ్లపై దూసుకుపోయి అందరనీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది బ్యాట్ మాన్ వాడిన బాట్‌మొబైల్‌ను పోలి ఉందని కొందరు.. , ఖరీదైన ఎలక్ట్రిక్ రిక్షాగా కనిపిస్తోందని మరికొందరు సోషల్ మీడియాలో రు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వాహనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి.
ఒక నెటిజన్ ఈ విలక్షణమైన వాహనానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని అందరికీ షేర్ చేశాడు. X లో పోస్ట్ చేస్తూ, అతను ఈ వాహనం లింక్స్ లీన్ ఎలక్ట్రిక్ అని గుర్తించాడు. ఇది డెన్మార్క్ కంపెనీ అయిన లింక్స్ కార్స్ సృష్టి. దీని ధర €35,000 ఉంటుంది అంటే మన కరెన్సీలో దాదాపు ₹31,00,000 ఉంటుంది. లింక్స్ లీన్ ఎలక్ట్రిక్.. రెండు-సీట్లు, మూడు చక్రాల టిల్టింగ్ వాహనం.
సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వీడియోల.. లింక్స్ లీన్ ఎలక్ట్రిక్ వాహనం.. ఇతర వాహనాల మధ్య ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గ్రీన్ లైట్ కోసం వేచి ఉంది. గ్రీన్ లైట్ పడగానే డ్రైవర్ త్రి-వీలర్‌ను ఫాస్ట్ గా U-టర్న్‌గా తీసుకుంటాడు. ఇక్కడే దాని ప్రత్యేకమైన టిల్టింగ్ ఫీచర్ అబ్బురపరుస్తుంది. అది టర్నింగ్ వైపు చాలా ఈజీగా దూసుకుపోతుంది.
లింక్స్ కార్స్ ప్రకారం, “మోటార్‌సైకిల్ లో ఉండే చురుకుదనం, కారులో ఉండే సౌకర్యం భద్రతను మిళితం చేసి రూపొందించింది. లింక్స్ లీన్ ఎలక్ట్రిక్ వినూత్న డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
స్పెసిఫికేషన్లు..
లింక్స్ లీన్ ఎలక్ట్రిక్ వాహనం (Tilting Electric vehicle) స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది గంటకు 169 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. కేవలం 7 సెకన్లలోనే 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. వాహనం గరిష్టంగా 45 డిగ్రీలలో వంపు తిరిగి ప్రయాణిస్తుంది. లింక్స్ లీన్ ఎలక్ట్రిక్ 12 kWh లిథియం మాంగనీస్ బ్యాటరీ ప్యాక్‌ను వినియోగించారు. ఇందులో ఉండే 40 kW ఎలక్ట్రిక్ మోటారు 75 kW పీక్ పవర్, 100 Nm టార్క్ ను జనరేట్ చేస్తుంది.
ECO మోడ్‌లో, లింక్స్ లీన్ ఎలక్ట్రిక్ 12 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించి 150 కిమీల డ్రైవింగ్ దూరాన్ని కవర్ చేయగలదు. అలాగే స్పీడ్ మోడ్‌లో ఇది 100 కి.మీల వరకు ప్రయాణిస్తుంది.
People are guessing about the Vehicle driven in Mumbai.
Here’s everything I could find about it.
This is the Lynx Lean Electric, a two-seater, three-wheeled tilting vehicle by Lynx Cars, a Danish company.Priced at €35,000, or ₹31,00,000, plus import costs. pic.twitter.com/otH8wSHA47
— Amit Bhawani 🇮🇳 (@amitbhawani) January 19, 2024
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
One thought on “Tilting Electric vehicle | ఇండియన్ రోడ్లపై ప్రత్యక్షమైన బ్యాట్ మాన్ తరహా కారు.. వైరల్ అవుతున్న వీడియోలు..”