కేరళా స్టార్టప్ GO EC Autotech నిర్ణయం
kerala-go-ec-autotech : కేరళలోని కొచ్చి ఆధారిత స్టార్టప్ అయిన GO EC Autotech Pvt Limited, ఈ సంవత్సరం 1,000 సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడానికి కంపెనీ సుమారు రూ.320 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈ కంపెనీ ఇప్పటికే 103 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.
“టైర్-2, టైర్-3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలతో పాటు జాతీయ, రాష్ట్ర రహదారుల అంతటా ప్రముఖ EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ప్రొవైడర్‌గా ఎదగడం GO EC ఆటోటెక్ ప్రణాళిక” అని సంస్థ CEO & ED, PG రామ్‌నాథ్ అన్నారు.
రిమోట్ లొకేషన్లలో నివసించే కస్టమర్ల అవసరాలను తీర్చడం, వారు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని సులభతరం చేయడమే కంపెనీ లక్ష్యం. ఈ విధానం దేశంలోని ప్రతి చోటా ప్రతీ మూలకు చేరుకోవడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తృతం ఏర్పాటు చేయడం వంటి చర్యలను చేపట్టనున్నట్లు రామ్ నాథ్ అన్నారు.
GO EC ప్రస్తుతం ప్రధాన రెస్టారెంట్లు షాపింగ్ మాల్స్ లో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది.
“దేశంలోని అన్ని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలో GO EC కంపెనీకి చెందిన అత్యాధునిక సూపర్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, ఇవి EV యజమానులకు అనుకూలమైన యాక్సెస్‌ను అందిస్తాయని తెలిపారు.
“ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు చార్జింగ్ విషయంలో ఆందోళన తొలగించేందుకు స్థిరమైన ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం. హరిత భవిష్యత్తుకు బాటలు వేయడం మా లక్ష్యం. ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన ఇబ్బంది ఏమిటంటే, తగినంత ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం, సుదూర ప్రయాణాన్ని చాలా కష్టమైన పనిగా మారడం, ఈ సమస్యను పరిష్కరిస్తూ, దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లను స్థాపించే మిషన్‌ను కంపెనీ స్వీకరించింది. ” అని రామ్ నాథ్ తెలిపారు.
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి
👍👍👌👌