Ather EV Sales June 2023: Ather Energy గత నెలలో భారతదేశంలో 6,479 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ గణంగాకాలను బట్టి చూస్తే
అమ్మకాల్లో 57.5 శాతం MoM క్షీణించినట్లు తెలుస్తోంది. FAME 2 సబ్సిడీలు తగ్గిపోవడం కారణంగా స్కూటర్ల ధరలు పెరిగిపోవడంతో EV అమ్మకాలు తగ్గిపోయినట్లు కంపెనీ అంచనా వేసింది.
ఏథర్ ఎనర్జీ జూన్ 2023 నెలలో దాని విక్రయాల గణాంకాలను వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ గత నెలలో భారతదేశంలో 6,479 యూనిట్లను విక్రయించగలిగింది. తక్కువ బేస్ కారణంగా 100.5 శాతం YY వృద్ధిని నమోదు చేసింది. అయితే.. MoM ప్రాతిపదికన.. కంపెనీ అమ్మకాలు 57 శాతానికి పైగా క్షీణించాయి. జూన్ 2022లో, దాని దేశీయ విక్రయాలు 3,231 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది మేలో, అథర్ 15,256 యూనిట్లను విక్రయించగలిగింది.
అమ్మకాల గణాంకాలపై ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా మాట్లాడుతూ.. “జూన్’23లో, మేము మా కస్టమర్‌లకు 6,479 యూనిట్లను
డెలివరీ చేశాము. FAME సబ్సిడీ తగ్గడం.. వినియోగదారులు తమ కొనుగోళ్లను మేలోను ముందస్తుగా చేపట్టడం అలాగే ఇటీవలి ధరల పెరుగుదల కారణంగా ఈ సంఖ్య
తగ్గిపోయింది. మేము ఊహించిన దాని కంటే తగ్గుదల కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, రాబోయే 2-3 నెలల్లో పరిశ్రమ మరింత పుంజుకుంటుంది’’ అని పేర్కొన్నారు.
మేము భారతదేశం అంతటా మా రిటైల్ పాయింట్లను విస్తరించడం కొనసాగించామన్నారు. ఇప్పుడు 90 నగరాల్లో 131 ఎక్స్ పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.