భారతదేశపు మొట్ట మొదటి ఎలక్ట్రిక్ క్రుయిజర్
దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ‘క్రూయిజర్ ను కొమాకి సంస్థ రూపొందించింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 కి.మీ
వరకు ప్రయాణించవ్చు. ఇదే కనుక మార్కెట్‌లోకి వస్తే భారతదేశపు ఎక్కువ రేంజ్ ఇచ్చే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా నిలవనుంది.
Komaki ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ జనవరి 2022లో క్రూయిజర్- స్టైల్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇప్పుడు ఆ బైక్‌కు ‘రేంజర్’ అని నామకరణం చేసిన టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌లో 250 కిమీ రైడింగ్ రేంజ్‌ను క్లెయిమ్ చేస్తుంది.
4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్
Komaki Ranger లో 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది భారతదేశంలోని ఎలక్ట్రిక్ టూ-వీలర్‌లో అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ అని, ఇది 250 కిమీ రేంజ్‌ను అందిస్తుందని కోమాకి కంపెనీ పేర్కొంది. కొమాకి రేంజర్ 5000-వాట్ల మోటారుతో శక్తిని పొందుతుందని వెల్లడించింది. క్రూయిజర్ బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్, రిపేర్ స్విచ్, రివర్స్ స్విచ్ అలాగే బ్లూటూత్ సిస్టంతోపాటు అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Komaki Ranger క్రూయిజర్ తరహా ఎలక్ట్రిక్ బైక్‌ను భారత్‌లో విడుదల చేయడం ఇదే తొలిసారి. దీనిని సరసమైన ధరకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ వాగ్దానం చేస్తోంది, తద్వారా ఇది ఎక్కువ మంది వినియోగారులకు విక్రయించవచ్చని కంపెనీ భావిస్తోంది. దీని ధర సుమారు రూ.లక్ష ఉండొచ్చని తెలుస్తోంది.
కొమాకి రేంజర్‌పై కొమాకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ.. “రేంజర్ భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ కాబట్టి.. గేమ్ ఛేంజర్‌గా మారబోతోందని తెలపారు. అయితే ధరను సరసమైన ధరలో ఉంచాలని తాము నిర్ణయించుకున్నామని చెప్పారు. కోమాకి రేంజర్ రూపకల్పన, అభివృద్ధిలో 1 మిలియన్ USD కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టింది. రేంజర్ మా మాస్టర్‌పీస్‌గా వస్తుందని నిర్ధారించుకోవడానికి మేము ఎటువంటి అవకాశాలన వదిలిపెట్టలేదని, ఇది మార్కెట్లో విడుదలైన తర్వాత ప్రేమతో స్వీకరించబడుతుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.
కొమాకి సంస్థ ఇదివరకే కొమాకి క్లాసిక్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఇది చూడడానికి యమహా ఆర్ఎక్స్ 100 బైక్‌లా రిట్రో మాదిరిగా కనిపిస్తుంది.
అలాగే కొమాకి దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేకంగా Komaki XGT X5 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. సాధారణ ద్విచక్రవాహనాలు నడపలేనవారికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. Komaki XGT X5 స్కూటర్‌ను ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 90కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇందులో లెడ్ యాసిడ్, లిథియం అయాన్ బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. లెడ్ యాసిడ్ స్కూటర్‌ను కేవలం రూ. 72,500 లకు ఆర్డర్ చేయవచ్చు. ఇక లిథియం-అయాన్ యూనిట్ రూ .90,500కు లభ్యమవుతుంది.
One thought on “Komaki Ranger : సింగిల్ చార్జిపై 250కిలోమీటర్ల రేంజ్”