Longest Range Electric Scooters | భారత్ లో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ల లిస్ట్ ఇదే..

Spread the love

Longest Range Electric Scooters : భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు వృద్ధి చెందుతోంది.  వినియోగదారులను ఆకట్టుకునే మైలేజీ, స్పీడ్ తో అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. ప్రజల్లో  ఎకో-ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్ పై అవగాహన పెరుగుతుండడంతో  భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించేవి, హైస్పీడ్ తో వెళ్లే స్కూటర్ల గురించి తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో   ఈవీ మార్కెట్లో కూాడా అనేక ఆప్షన్లు  ఉన్నాయి.

Longest Range Electric Scooters ఈ కథనం భారతదేశంలోని టాప్ 6 లాంగెస్ట్ రేంజ్  ఎలక్ట్రిక్ స్కూటర్‌ల గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. ఎక్కువ దూరం ప్రయాణించే స్కూటర్ల జాబితా వాటి స్పెసిఫికేషన్లను పరిశీలించేందుకు ఈ స్టోరీ ఒక రోడ్ మ్యాప్ లా పనిచేస్తుంది..  ఇక ఆలస్యమెందుకు పదండి ముందుకు..

1 . BRISK EV (బ్రిస్క్ ఈవీ)

Brisk-EV Longest Range Electric Scooters

బ్రిస్క్ EV అనేది లాంగెస్ట్ ఈవీ జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచింది.  మన హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ.. 2023 మార్చి లో ఆరిజిన్,  ఆరిజిన్ ప్రో (Origin, Origin Pro) పేరుతో బ్రిస్క్ EV కంపెనీ రెండు మోడళ్లను పరిచయం చేసింది. ఇది ఒక్కసారి ఛార్జ్‌పై అత్యధికంగా 333 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.. BRISK EVని ఇతర బ్రాండ్ల నుంచి ప్రత్యేకంగా ఉంచింది దీని రేంజ్.  ఇది పూర్తిగా భారతదేశంలోనే తయారైంది.  BRISK EVలో ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లు, బ్లూటూత్ కనెక్టివిటీ,  యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ యాప్ వంటి ఆధునిక ఫీచర్లు ఉంటాయి.  అయితే  ఈ కంపెనీ స్కూటర్లు త్వరలోనే అధికారిక లాంచ్ అవుతాయని  భావిస్తున్నారు.

బ్రిస్క్ EV స్పెసిఫికేషన్స్

  • రేంజ్:  చేస్తే 333 కి.మీ
    యాక్సిలరేషన్  : కేవలం 3.3 సెకన్లలో 0-40 kmph
  • ధరలు: సబ్సిడీ తర్వాత రూ. 1,20,000-1,40,000  మధ్య ఉండవచ్చు
  • గరిష్ట వేగం: 85 kmph
  • బ్యాటరీ కెపాసిటీ: 4.8 kWh (ఫిక్స్ డ్ ) + 2.1 kWh (డిటాచబుల్ )
  • మోటార్ కెపాసిటీ: 5.5 kW (పీక్ పవర్)  2.1 kW
  • అదనపు ఫీచర్‌లు: OTA (v2c) అప్‌డేట్‌లు, బ్లూటూత్ కనెక్టివిటీ,మొబైల్ యాప్

2. RIVOT NX100 (రివోట్ ఎన్ ఎక్స్ 100)

Rivot Motors NX100 Longest Range Electric Scooters

రివోట్ మోటార్స్ రివోట్ ఎన్ఎక్స్100 ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది. ఇందులో ఐదు రకాలైన క్లాసిక్, ప్రీమియం, ఎలైట్, స్పోర్ట్స్, ఆఫ్‌ల్యాండర్ వేరియంట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి విభిన్న రైడర్ ప్రాధాన్యతలను కలిగి ఉంటుంది.  Rivot NX100 టాప్ వేరియంట్ 300 కిమీల రేంజ్ ను ఇస్తుంది. వేరియంట్‌ల ధర రూ. 89,000  నుంచి ప్రారంభమవుతుంది.  క్లాసిక్, ప్రీమియం,ఎలైట్ సబ్-వేరియంట్‌లను కలిగి ఉన్న స్ట్రీట్ రైడర్ వేరియంట్, బ్లాక్, వైట్, గ్రే, మినరల్ గ్రీన్, పిస్తా, పింక్ ,పర్పుల్ అనే ఏడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.  స్పోర్ట్స్ వేరియంట్  తెలుపు, ఆరెంజ్ డ్యూయల్-టోన్ డిజైన్‌ను కలిగి ఉంది. అయితే టాప్-టైర్ ఆఫ్‌ల్యాండర్ వేరియంట్ డెసర్ట్ కలర్ లో అందుబాటులో ఉంది.  రివోట్ మోటార్స్ అప్‌గ్రేడబుల్ రేంజ్ ను  పరిచయం చేసింది. కొనుగోలుదారులు 100 కిమీ మోడల్ నుండి 300కిమీ వరకు తమ అవసరాలకు అనుగుణంగా డబ్బులు చెల్లించి రేంజ్ ను పెంచుకునే వీలుకల్పించింది.  కాగా ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవతో  Rivot NX100 పూర్తిగా కర్ణాటకలోని బెలగావిలో తయారు చేస్తోంది.

RivotNX100 [స్ట్రీట్ రైడర్- మ్యాక్స్ వేరియంట్] స్పెసిఫికేషన్స్

  • రియల్ రేంజ్: 300 కి.మీ
  • గరిష్ట వేగం: 110 km/h
  • బ్యాటరీ ప్యాక్: 5760 Wh
  • ధర: ₹1,59,000/- (ఎక్స్-షోరూమ్)
  • ప్రీ-బుక్ ధర: ₹499/- (పూర్తిగా తిరిగి చెల్లించబడుతుంది)

ప్రీ-బుక్ చేసిన కస్టమర్ల కోసం అదనపు ఫీచర్లు: APU (సహాయక శక్తి యూనిట్)
రైడ్‌క్యామ్, కంఫర్ట్‌కీ, లేడీ ఫుట్‌రెస్ట్, కంఫర్ట్‌బూట్, రోల్ ప్రొటెక్ట్, క్రూయిజ్ కంట్రోల్
TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్),ఈ  స్కూటర్‌ను ₹499/-కి ప్రీ-బుక్ చేసే కస్టమర్‌లు  అదనంగా  ఫీచర్‌లను ఆస్వాదించవచ్చు.

3. Simple One (సింపుల్ వన్)

Simple one

సింపుల్ ఎనర్జీ  గతేడాది మే 23న “సింపుల్ వన్ పేరుతో తన తొలి  EV ని విడుదల చేసింది.  ఇటీవలే  డాట్ వన్ పేరుతో తన రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ ను కూడా లాంచ్ చేసింది.  ఇది స్టైలిష్ గా స్పోర్టీ లుక్స్ తో ఉంటుంది. ఇది సింగిల్ చార్జిపై  212 కిమీల రేంజ్ ను అందిస్తుంది.  స్కూటర్ IP67 సర్టిఫికేషన్‌తో 5kWh Li-ion బ్యాటరీని కలిగి ఉంటుంది.  దాని స్వాపబుల్  బ్యాటరీల AIS 156 ఫేజ్ 2 సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది.   ఆకట్టుకునే 8.5kW పీక్ పవర్ మోటార్‌తో, రైడర్‌లకు చక్కని పనితీరును అందిస్తుంది.  ఇందులో 4.2 బ్లూటూత్, OTA అప్‌డేట్‌లు, డాక్యుమెంట్ స్టోరేజ్, డెడికేటెడ్ మొబైల్ అప్లికేషన్ ఉన్నాయి. “సూపర్ స్టాక్” ట్రాకింగ్ సిస్టమ్, సమగ్ర రైడ్ హిస్టరీ డేటాను అందించడం గమనార్హం.

సింపుల్ వన్ ఫీచర్స్..

  • రేంజ్: ఒక్కో ఛార్జీకి 212 కి.మీ
  • టాప్ స్పీడ్ : 105 km/h
  • పీక్ మోటార్ పవర్: 4500 W
  • ఛార్జింగ్ సమయం: 6 గంటలు 0-80% (హోమ్ ఛార్జర్)
  • టార్క్: 72 Nm

కలర్ ఆప్షన్స్ : బ్రాజెన్ బ్లాక్, నమ్మా రెడ్, అజూర్ బ్లూ, గ్రేస్ వైట్, “బ్రాజెన్ ఎక్స్,లైట్ ఎక్స్.
సూపర్ EV బేస్ మోడల్‌కు  INR 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 750-వాట్ల పోర్టబుల్ ఛార్జర్‌కు అదనంగా రూ. 13,000 చెల్లించాల్సి ఉంటుంది. . ప్రత్యేకమైన Brazen X , లైట్ X కలర్ వేరియంట్‌లు INR 1.5లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది.

4. OLA S1 PRO GEN 2 (ఓలా ఎస్1 ప్రో జెనరేషన్ 2)

Ola s1 pro

Ola Electric  పోర్ట్‌ఫోలియోకు అనేక మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. , 2023 ఆగష్టు 15 న కొత్తగా  Ola S1 Pro Gen 2ని ప్రారంభించింది. గతంలో వచ్చిన  Ola S1 Pro Gen 1 మోడళ్ల కంటే మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది.   Ola S1 Pro Gen 2  సింగిల్ ఛార్జ్‌కి 195 కిమీ  రేంజ్ ఇస్తుంది. ఇది Ola పోర్ట్‌ఫోలియోలో అత్యధికం. S1 Pro Gen 2 దాని గత మోడళ్ల కంటే  మన్నికంగా మాత్రమే కాకుండా దాని మినిమలిస్ట్ డిజైన్‌లో రెట్రో లుక్ ను  కలిగి ఉంటుంది.

 Ola S1 Pro Gen 2 స్పెసిఫికేషన్స్

  • రేంజ్: ఒక్కో ఛార్జీకి 195 కి.మీ
  • గరిష్ట శక్తి: 11 kW
  • త్వరణం: 2.6 సెకన్లు
    గరిష్ట వేగం: 120 kmph
  • ధర: రూ. 1,47,499

5. ATHER 450 APEX (ఏథర్ 450 అపెక్స్)

ATHER 450 APEX

Longest Range Electric Scooters లిస్ట్ లో ఏథర్ అపెక్స్ స్కూటర్ ఐదో స్థానంలో నిలిచింది.  ఏథర్ కంపెనీ జనవరి 6, 2024న ఈ హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది.  ఏథర్ 450 అపెక్స్ 157 కిమీల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది.  .ఈ కొత్త స్కూటర్  విలక్షణమైన డిజైన్ తో  ఏథర్ లైనప్‌లోని  గత ఈవీలకు భిన్నంగా కనిపిస్తుంది.  కంపెనీ పదేళ్ల వార్షికోత్సవం సందర్బంగా  Ather 450 Apex విడుదల చేయడమేకాకుండా వినూత్నమైన Warp+ మోడ్‌ను పరిచయం చేసింది.  స్టాండ్‌అవుట్ ఫీచర్, మ్యాజిక్ ట్విస్ట్,  రీజనరేటివ్  ఫంక్షన్‌ వటి ఫీచర్లను కలిగి ఉంటుంది.  యాక్సిలరేటర్‌ను వెనుకకు తిప్పడం ద్వారా రైడర్‌లు స్కూటర్‌ను క్రమక్రమంగా వేగాన్ని తగ్గించగలిగే  సరికొత్త ఫీచర్ ఇందులో ఉంటుంది.  ఈ ఫీచర్ ఈవీ పరిశ్రమలోనే  తొలిసారి వచ్చింది.

ఏథర్ 450 అపెక్స్ స్పెసిఫికేషన్స్

  • రేంజ్ : 157 కి.మీ
  • గరిష్ట వేగం: 100 km/h
  • పవర్ అవుట్‌పుట్: 7 kW
  • ఆక్సిలరేషన్ : 2.9 సెకన్లు
  • బ్యాటరీ: 3.7 kWh
    ఛార్జింగ్ సమయం: 5 గంటల 54 నిమిషాలు

6. Bajaj chetak Premium (బజాజ్ చేతక్ ప్రీమియం)

2024 Bajaj Chetak Premium Electric scooter

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో లిమిటెడ్ 2024 జనవరి 5న  Chetak Premium  ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రారంభించింది. గతంలో వచ్చిన చేతక్ కంటే మెరుగైన  ఫీచర్లతో దీనిని తీసుకొచ్చారు.  బజాజ్ చేతక్ ప్రీమియం స్కూటర్ సర్టిఫైడ్  రేంజ్ 127 కి.మీ. ఇది Tecpac,  స్టాండర్డ్ ప్యాకేజీలలో అందుబాటులో ఉంది. దాని గత మోడళ్ల కంటే  ఎక్కువ కస్టొమైజేషన్ ఎంపికలను అందిస్తోంది. 2024 చేతక్ ప్రీమియం 5-అంగుళాల TFT స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.  వినియోగదారులకు మ్యూజిక్, కాల్‌లు, వంటి సమచారాన్ని చూపిస్తుంది.  హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్కూడా ఇందులో ఉంది.

 Chetak Premium స్పెసిఫికేషన్‌లు:

  • రేంజ్ : 127 కి.మీ
  • గరిష్ట వేగం: 73 kmph
  • ఛార్జింగ్ సమయం: 4 గం 30 నిమిషాలు
  • బ్యాటరీ: ఆన్ బోర్డ్, 650w

2024 చేతక్ ప్రీమియం Tecpac వేరియంట్ ధర రూ. 1,44,463. ఇది వినియోగదారులకు మెరుగైన ఫీచర్లను అందిస్తుంది. అలాగే  స్టాండర్డ్ వెర్షన్, రూ. 1,35,463 వద్ద అందుబాటులో ఉంది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..