Saturday, December 7Lend a hand to save the Planet
Shadow

ఇకపై ఫ్లిప్ కార్ట్ లో Matter EV ఎలక్ట్రిక్ బైక్ సేల్స్

Spread the love

Matter EV స్టార్ట్-అప్ తాజాగా ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రీ-బుక్ చేయడానికి అలాగే కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్‌తో జట్టుకట్టింది. దీనివల్ల ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్‌లను వినియోగదారులు పొందవచ్చు.

ఆన్‌లైన్, మొబైల్, ఫిజికల్ డీలర్‌షిప్‌లతో సహా ఛానెల్‌లలో సులభమైన కొనుగోలు అనుభవాన్ని అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. Flipkart ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ అనుభవం ద్వారా Matter తన కస్టమర్‌లకు Matter Aera బైక్ లను కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తుంది.

అదిరిపోయే ఫీచర్లు

ఆల్-ఎలక్ట్రిక్ మేటర్ ఏరా ఒక ప్రత్యేకమైన మోటార్‌సైకిల్. ఇది సాంప్రదాయ క్లచ్, గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్న మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఇది రూ. 1.43 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభమవుతుంది.  Matter EV Aera లిక్విడ్-కూల్డ్ 5kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది e-బైక్ 6 సెకన్లలోనేపు 0 నుంచి 60kmph వరకు వేగాన్ని అందుకుంటుంది. ఇక దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 125km వరకు ప్రయాణిస్తుంది.

మ్యాటర్ వ్యవస్థాపకుడు, సీఈవో మోహల్ లాల్‌భాయ్ మాట్లాడుతూ.. “స్మార్ట్‌ఫోన్‌లు.. ఇంటర్నెట్ యుగంలో ఇ-కామర్స్ స్ట్రాటమ్ అంతటా విస్తరించిపోయింది. అందుకోసమే ఫ్లిప్‌కార్ట్‌తో మేం చేసుకున్న ఒప్పందం వినియోదారులకు మెరుగైన సేవలందిస్తుందని తెలిపారు. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లోని క్యాటగిరీ హెడ్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ & ఆటోమొబైల్స్ డైరెక్టర్ భరత్ కుమార్ బిఎస్ మాట్లాడుతూ.. “భారతదేశంలోని 25 జిల్లాల్లోని మా కస్టమర్‌లు 2000 పిన్ కోడ్‌లను ప్రీ-బుక్ చేయగలరని తెలిపారు.


tech news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *