Home » ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూశారా..

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూశారా..

Spread the love

Neon zero one electric scooter

దేశ‌వ్యాప్తంగా ఈవీల‌పై పెరుగుతున్న డిమాండ్ కార‌ణంగా అనేక స్వ‌దేశీ సంస్థ‌లు ఈవీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెడుతున్నాయి. అనేక విదేశీ కంపెనీలు కూడా మ‌న దేశంలో కొత్త‌కొత్త ఎల‌క్ట్రిక్ వాహనాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. ఈ జాబితాలోకి

జర్మనీకి చెందిన ఆటోమొబైల్ సంస్థ నాన్ (Naon)  కూడా చేరింది. నాన్ సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్  Neon zero one electric scooter ప్రోటోటైప్‌ను తన స్వదేశంలో ఆవిష్కరించింది. జీరో వన్ అని పిలవబడే ఈ స్కూట‌ర్‌ రెండు వేరియంట్‌లలో వస్తుంది.  అందులో మొద‌టిది L1e రెండోది L3e  ఈ స్కూట‌ర్ల ధ‌ర‌లు వ‌రుస‌గా  € 4,920 (రూ. 4.20 లక్షలు),  € 6,420 (రూ. 5.48 లక్షలు).

Neon zero one electric scooter
అయితే దీని ధ‌రను బ‌ట్టి చూస్తే ఇది ప్రీమియం సెగ్మెంట్ కిందికి వ‌స్తుంది. డిజైన్ విష‌యానికొస్తే నియాన్ జీరో వన్ స్కూట‌ర్ మిగ‌తా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు ఎంతో భిన్నంగా క‌నిపిస్తోంది. ఇది తక్కువ బాడీ ప్యానెల్‌లను కలిగి  మినిమలిస్ట్ డిజైన్‌తో క‌నిసిప్తోంది.

 

ఈ ఎల‌క్ట్రిక్ వాహ‌నం డిజైన్ చాలా క్లీన్ గా అలాగే సింపుల్ గా ఉంటుంది. బాడీ లైన్స్ మాత్రం ఈ స్కూటర్‌ను షార్ప్‌గా కనిపించేలా చేస్తోంది. ఇందులో సింగిల్-పీస్ ఫ్లాట్ సీట్, పొడవాటి ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, నేక్డ్ హ్యాండిల్ బార్, ఓపెన్ రియర్ స్వింగార్మ్, ముందు భాగంలో  విండ్‌షీల్డ్ అప్ ఫ్రంట్‌ వంటివి దీన్ని ప్ర‌త్యేకంగా కనిపించేలా చేస్తున్నాయి. సీటు కింది భాగంలో ఉన్న టేయిల్ లాంప్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది.
ముంద‌ర విండ్‌షీల్డ్‌పై ఉన్న దీర్ఘచతురస్రాకార సింగిల్ బార్ ఎల్ఈడి హెడ్‌లైట్, తోపాటు ఫ్లోర్‌బోర్డ్‌లో అమర్చిన బ్యాటరీ ప్యాక్ స్కూటర్‌కు చాలా తక్కువ గురుత్వాకర్షణ కేంద్రాన్ని అందిస్తుంది. దీంతో ఇది మంచి రైడ్ స్టాబిలిటీ ఇస్తుంది.

140కి. మి రేంజ్

నియాన్ జీరో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో డిటాచ‌బుల్ 2.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమ‌ర్చారు. ఒక్కసారి ఫుల్‌ చార్జ్ చేస్తే, గరిష్టంగా 70 కిమీల రేంజ్ ను పొందవచ్చు.
ఇందులో అదనపు బ్యాటరీ ప్యాక్‌ని చేర్చ‌డం ద్వారా దీని రేంజ్ ను పై గరిష్టంగా 140 కిలోమీట‌ర్ల వ‌ర‌కు పెంచుకోవచ్చు. బ్యాటరీ ప్యాక్ లను బ‌ట్టి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్లు ప‌నితీరులో తేడా క‌నిసిస్తుంది. దీని బేస్ L1e వేరియంట్ గరిష్టంగా 3 kW అవుట్‌పుట్‌ను ఇస్తుంవ‌ది. ఇది 45 kmph మాగ్జిమం స్పీడ్‌తో ప్ర‌యాణిస్తుంది. ఇక, L3e వేరియంట్ 10 kW (13.4 bhp), 200 Nm టార్క్‌తో 7 kW రియర్ హబ్ మోటారును కలిగి ఉంటుంది.

బ్రేకింగ్ విష‌యానికొస్తే ఇందులో ABS ఫీచర్‌తో ఉపయోగించబడే ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. నియాన్ జీరో వన్ ప్రత్యేక ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది. హ్యాండిల్‌బార్‌పై రైడర్ స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. నియాన్ జీరో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం జర్మనీ మార్కెట్లో అందుబాటులో ఉంది. త్వ‌ర‌లో భారత మార్కెట్లో కూడా విడుదల కావచ్చని తెలుస్తోంది.


 

One thought on “ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూశారా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *