Home » WardWizard నుంచి హై స్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

WardWizard నుంచి హై స్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

Spread the love

విప‌ణిలోకి WardWizard electric scooters

55కి.మి స్పీడ్,  100 కి.మి. రేంజ్‌

WardWizard electric scooters  గుజ‌రాత్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్  త‌యారీ సంస్థ ‘వార్డ్‌విజార్డ్ ఇటీవ‌ల రెండు కొత్త ‘మేడ్-ఇన్-ఇండియా’ హై-స్పీడ్ స్కూటర్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది  ఇందులో  మొద‌టిది వోల్ఫ్  ప్ల‌స్‌, రెండోది జెన్ నెక్స్ట్ నాను ప్ల‌స్‌

Wolf+ ధర ₹1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా,  Gen Next Nanu+ అలాగే Del Go ధర వరుసగా ₹1.06 లక్షలు,  ₹1,14,500 (ఎక్స్-షోరూమ్).

హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లోకి తాము ప్ర‌వేశించిన‌ట్లు కంపెనీ పేర్కొంది. ‘మేక్-ఇన్-ఇండియా స్ఫూర్తితో కొత్త స్కూటర్‌లను రూపొందించినట్లు తెలిపింది. గుజరాత్‌లోని వడోదరలో ఉన్న అత్యాధునిక తయారీ కేంద్రంలో కంపెనీ స్కూటర్‌లను తయారు చేయనుంది.

కంపెనీ 2022 ఫిబ్ర‌వ‌రి 11 నుంచి ఈ కొత్త స్కూటర్ బుకింగ్‌లను ప్రారంభించింది. మూడు మోడల్‌లు 3 సంవత్సరాల వారంటీతో వస్తాయని వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ & మొబిలిటీ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ యతిన్ గుప్తే అన్నారు.

WardWizard electric scooters Wolf+, Gen Next Nanu  ఫీచ‌ర్లు ఇవీ

కొత్త Wolf+, Gen Next Nanu ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కీలెస్ స్టార్ట్/స్టాప్, స్మార్ట్ కనెక్టివిటీ, డ్రైవింగ్ మోడ్‌లు, రిమోట్ అప్లికేషన్‌లు, రివర్స్ మోడ్, యాంటీ థెఫ్ట్ తోపాటు GPS ఎనేబుల్ వంటి స్మార్ట్ ఫీచర్లతో వస్తాయి. ఈ స్కూటర్లలో 1500W మోటార్‌ను వినియోగించారు.  ఇది 20 Nm గరిష్ట టార్క్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. ఇది గంట‌కు గరిష్టంగా 55 kmph వేగంతో దూసుకుపోతుంది. అలాగే, WardWizard high-speed e-scooters లో  60V35Ah  బ్యాట‌రీని అమ‌ర్చారు. ఈ స్కూటర్ సింగిల్ చార్జిపై సుమారు 100 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది.

“ వాహ‌న‌దారులు ఇ-మొబిలిటీకి మారడానికి ప్ర‌భుత్వం వివిధ ప్రోత్సాహకాలు, సబ్సిడీలను అందిస్తున్నందున  అత్యాధునిక సాంకేతికత, ప్రపంచ స్థాయి ఉత్పత్తులతో ఈవీ పరిశ్రమ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి తాము కృషి చేస్తున్న‌ట్లు  మేనేజింగ్ డైరెక్టర్ యతిన్ గుప్తే తెలిపారు. ఈ సంవత్సరం తాము మా పోర్ట్‌ఫోలియో, నెట్‌వర్క్‌ని విస్తరించడం, కొత్త విభాగాల్లోకి విస్తరించడంపై దృష్టి పెడుతున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *